ETV Bharat / sports

'టెస్టు క్రికెట్​ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది' - వాషింగ్టన్ సుందర్

క్రికెట్​లో అత్యుత్తమ ఫార్మాట్​ అయిన టెస్టు క్రికెట్​లో ఆడడం క్రికెటర్​గా తనకెంతో కలిసొచ్చిందని అన్నాడు టీమ్​ఇండియా క్రికెటర్​, ఐపీఎల్​లో ఆర్​సీబీ స్పిన్నర్​ వాషింగ్టన్​ సుందర్​. భారత టెస్టు జట్టులో భాగమై.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ వంటి బలమైన టీమ్స్​పై గెలుపొందడం వల్ల తనలోని ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపాడు. అదే విశ్వాసంతో భవిష్యత్​లోనూ రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Washington
వాషింగ్టన్​ సుందర్
author img

By

Published : Apr 21, 2021, 4:41 PM IST

టెస్టు క్రికెట్​లో భాగమవ్వడం వల్ల తనలోని ఆత్మవిశ్వాసం మరింత మెరుగైందని అంటున్నాడు టీమ్​ఇండియా, ఆర్​సీబీ స్పిన్నర్ వాషింగ్టన్​ సుందర్​. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా వంటి జట్లపై ఆడడం వల్ల తనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని తెలిపాడు.

"టెస్టు క్రికెట్​లో రాణించడం.. ఏ క్రికెటర్​కైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. టీమ్ఇండియాలో భాగమై.. క్రికెట్​లో అత్యుత్తమ స్థాయి ఫార్మాట్​ను ఆడడం వ్యక్తిగతంగా నాకు చాలా బాగుంది. ప్రతి క్రికెటర్​ కనే కల ఆ ఫార్మాట్​​లో రాణించడం.. అది నా విషయంలో నెరవేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ వంటి బలమైన జట్లపై గెలవడం వల్ల నాలోని ఆత్మవిశ్వాసం పెంపొందింది. ఇదే విశ్వాసంతో నేను భవిష్యత్​లోనూ రాణించగలనని భావిస్తున్నా".

- వాషింగ్టన్ సుందర్​, ఆర్​సీబీ స్పిన్నర్

వరుసగా రెండో ఏడాది ఐపీఎల్​ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడంపై వాషింగ్టన్ సుందర్​ స్పందించాడు. "ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్​ ఆడడం వరుసగా ఇది రెండో ఏడాది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులకు అలవాటు పడ్డాం. కానీ, ప్రేక్షకులు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతారని నమ్ముతాను. ఏదీ ఏమైనా ఇలాంటి సంక్షోభంలోనూ క్రికెట్​ ఆడడం సంతోషం కలిగించే విషయం" అని అన్నాడు.

ఇదీ చదవండి : టీ20 ర్యాంకింగ్స్​: రెండో ర్యాంకులో బాబర్​.. కోహ్లీ@5

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.