ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది. నేడు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. అయితే తమ జట్టుకు ఈ పిచ్ కొత్త కావడం వల్ల కొంత ఆందోళనకు గురైనట్లు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
''చెపాక్ పిచ్‌లో మా జట్టుకు ఇది తొలి మ్యాచ్. పిచ్ పరిస్థితిని అంచనా వేయడంలో మాకు కొంచెం సమయం ఎక్కువ పట్టింది. మేము మరో 10-15 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం వేరుగా ఉండేది. సన్‌రైజర్స్ గెలుపునకు వారి బౌలింగ్ దళం కారణం. ఎందుకంటే ఈ స్టేడియంలో వాళ్లు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడడం వల్ల పిచ్‌పై అవగాహన వచ్చింది. మా బౌలర్లు చాలా కష్టపడ్డారు. కానీ, అంత త్వరగా పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి.. అనేది రాబోయే మ్యాచ్‌లపై భారం పడకుండా చూసుకుంటాం."
- కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్
లీగ్‌లో వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపొందింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొంది బోణీ కొట్టింది. పంజాబ్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37) ఔటైనా.. బెయిర్‌స్టో (63 నాటౌట్), కేన్ విలియమ్సన్ (16 నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
ఇదీ చూడండి: ఐపీఎల్లో నికోలస్ పూరన్ చెత్త రికార్డు