ETV Bharat / sports

RCB vs SRH: 'డివిలియర్స్​కు పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశా ' - ఆర్సీబీ X సన్​రైజర్స్

బుధవారం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో(SRH vs RCB) జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చివరి ఓవర్​లో బౌలింగ్ చేసిన పేసర్ భువనేశ్వర్​(bhuvneshwar kumar news) మాట్లాడాడు. డివిలియర్స్​ క్రీజులో ఉన్నప్పుడు వైడ్​ యార్కర్లు వేసేందుకే ప్రయత్నించినట్లు తెలిపాడు.

bhuvaneshwar
భువనేశ్వర్
author img

By

Published : Oct 7, 2021, 11:59 AM IST

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(RCB vs SRH) ఆటగాడు ఏబీ డివిలియర్స్​ క్రీజులో ఉండగా వైడ్​ యార్కర్లు వేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు సన్​రైజర్స్​ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar News). బుధవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్​ చేసి ఆర్సీబీ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ పలు వ్యాఖ్యలు చేశాడు.

"నా చేయి బాగా తిరిగింది. ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో వైడ్​ యార్కర్లు వేసేందురు ప్రయత్నించా. తొలుత స్టంప్స్ దిశగా యార్కర్​ వేసి ఆరు పరుగులు సమర్పించుకున్నా. అందుకే వైడ్​ యార్కర్లు వేయడమే సరైన నిర్ణయం అని భావించా. దుబాయ్​లోని మూడు మైదానాల్లో మేం పెద్దగా స్కోరు నమోదు చేయలేదు. కానీ, నిన్నటి మ్యాచ్​లో 10 నుంచి 15 పరుగులు తక్కువే చేశామని అనిపించింది."

-భువనేశ్వర్ కుమార్, బౌలర్.

బుధవారం జరిగిన మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 44 పరుగులతో టాప్​ స్కోరర్​గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్​ దిగిన బెంగళూరు నాలుగు పరుగులు తేడాతో ఓడిపోయింది. ఎస్​ఆర్​హెచ్ తమ చివరి మ్యాచ్​ శుక్రవారం ముంబయితో ఆడనుంది.

ఇదీ చదవండి:

భారీ షాట్లు ఆడనివ్వలేదు: కోహ్లీ.. పట్టుదలతో ఆడాం: విలియమ్సన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.