ETV Bharat / sports

'ముంబయిని అడ్డుకునే సత్తా ఆ జట్టుకే ఉంది'

ఐపీఎల్​(ipl 2021 schedule)లో ముంబయి ఇండియన్స్​(mumbai indians team)ను అడ్డుకోగల సత్తా ఒక్క జట్టుకు మాత్రమే ఉందని వెల్లడించాడు మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్. ఆ జట్టేంటో తెలుసా?

MI
ముంబయి
author img

By

Published : Sep 16, 2021, 7:37 PM IST

Updated : Sep 16, 2021, 7:59 PM IST

డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌(mumbai indians team)ను అడ్డుకోగల సత్తా దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకే ఉందని మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌(brad hogg on rohit sharma) అన్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్‌(ipl 2021 schedule) అర్ధాంతరంగా వాయిదా పడటం దిల్లీ జట్టుకు కలిసొచ్చిందని పేర్కొన్నాడు. భుజం గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన శ్రేయస్‌ అయ్యర్(shreyas iyer ipl career), కరోనా కారణంగా ఈ సీజన్‌ నుంచి తప్పుకొన్న సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. దీంతో ఆ జట్టు మరింత బలోపేతమైందని పేర్కొన్నాడు. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్‌ (ipl 2021 second phase schedule) మలి దఫా మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

"డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ మరో టైటిల్ గెలవకుండా అడ్డుకోగల సత్తా ఒక్క దిల్లీ క్యాపిటల్స్‌కే ఉంది. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ రాకతో దిల్లీ క్యాపిటల్స్‌ మరింత బలోపేతమైంది. ఇకపై ఆ జట్టు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌పై భారం వేయాల్సిన అవసరం లేదు. అలాగే, బౌలింగ్‌ విభాగంలో యువ సంచలనం ఆవేశ్ ఖాన్‌ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో 14 వికెట్లు తీసి దిల్లీ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. కోచ్ రికీ పాటింగ్‌ ప్రోత్సాహంతో అతడు మరింత రాటుదేలాడు. ప్రస్తుతం ఆ జట్టులో సమతూకం కనిపిస్తోంది" అని బ్రాడ్‌ హగ్‌ తెలిపాడు.

ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్(delhi capitals ipl 2021) 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో ఆ జట్టు ఆరింటిలో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్​లు గెలిస్తే ఈ జట్టు ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంటుంది.

ఇవీ చూడండి: కోహ్లీ కీలక నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్​బై

Last Updated : Sep 16, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.