ETV Bharat / sports

రోహిత్‌ నమ్మాడు.. రాహులే కారణం.. బోల్తా పడ్డాం!

మంగళవారం ముంబయి-కోల్​కతాల మధ్య జరిగిన మ్యాచ్​పై పలువురు ఆటగాళ్లు స్పందించారు. ఓటమి తప్పదనుకున్న స్థితిలో నుంచి గొప్పగా పుంజుకున్నామని ముంబయి కెప్టెన్ రోహిత్ తెలిపాడు. అత్యుత్తమంగా ఆడినప్పటికీ గెలవలేకపోయామని కోల్​కతా సారథి పేర్కొన్నాడు.

rohit, chahar, boult, morgan
రోహిత్, చాహర్, బౌల్ట్, మోర్గాన్
author img

By

Published : Apr 14, 2021, 10:04 AM IST

తాను బంతిని అందుకొన్నప్పుడు ఒత్తిడి నెలకొందని ముంబయి ఇండియన్స్‌ యువ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ అన్నాడు. సామర్థ్యంపై నమ్మకం, రోహిత్‌ తనపై చూపిన విశ్వాసంతో రాణించానని తెలిపాడు. ఓడిపోయే స్థితి నుంచి గొప్పగా పుంజుకున్నామని ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఈ ఘనత మొత్తం జట్టుకే చెందుతుందన్నాడు. ఓటమి నిరాశ కలిగించిందని చాలా వరకు నాణ్యమైన క్రికెట్టే ఆడామని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌ సేన నిర్దేశించిన 153 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా 10 పరుగుల తేడాతో ఓడింది.

రోహిత్‌ నమ్మాడు..

rahul chahar
రాహుల్ చాహర్

"కోల్‌కతాకు శుభారంభం దక్కడం వల్ల మాపై ఒత్తిడి నెలకొంది. స్పిన్నర్లు రాణిస్తారని మాత్రం తెలుసు. త్రిపాఠి వికెట్‌ను నేను ఆస్వాదించాను. రెండు మూడేళ్లుగా ఐపీఎల్‌ ఆడుతుండటం వల్ల నా సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నా. గిల్‌ ప్రతి బంతినీ సిక్సర్‌గా బాదడని తెలుసు. 90 కి.మీ వేగంతో బంతులు విసరడం నా బలం. నితీశ్ ముందుకొచ్చి ఆడుతున్న సంగతిని గమనించాను. అందుకే నా స్పెల్‌లో ఆఖరి బంతిని ఆఫ్‌సైడ్‌ ఫ్లిప్పర్‌గా వేశాను. కొన్నిసార్లు నా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కానీ రోహిత్‌ నాపై నమ్మకం ఉంచి ప్రోత్సహించాడు. లీగ్​ లేనప్పుడూ ముంబయి తన ఆటగాళ్లను బాగా చూసుకుంటుంది. అదే దాని ప్రత్యేకత" అని రాహుల్​ చాహర్​ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: రాజస్థాన్​కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌

రాహులే వికెట్లు తీశాడు..

rohit sharma
రోహిత్ శర్మ

"గొప్పగా పోరాడాం. జట్టులో ప్రతి ఒక్కరు అద్భుతంగా పుంజుకున్నారు. ఇలాంటి మ్యాచులు తరచూ జరగవు. ఈ గెలుపుతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని మున్ముందు కొనసాగిస్తాం. పవర్‌ప్లేలో కోల్‌కతా విజృంభించి ఆడింది. ఆట మధ్యలో రాహుల్‌ మాకు వికెట్లు అందించాడు. కృనాల్‌ కీలక ఓవర్లు విసిరాడు. ఏదేమైనా ఈ గెలుపు ఘనత బౌలర్లకే దక్కుతుంది. బ్యాటర్లు ఇంకా మెరుగ్గా ఆడాలి. చెన్నైలో మొదటి బంతి నుంచే బాదడం కష్టం. అందుకే బ్యాటింగ్‌కు వెళ్లే ముందే ప్రణాళిక వేసుకోవాలి. మేం 15-20 పరుగులు తక్కువే చేశాం. నేను చివరి వరకు నిలిస్తే బాగుండేది. సూర్యకుమార్‌ తన ఫామ్‌ కొనసాగించాడు. తొలి ఓవర్లలో అతడు నిర్భయంగా ఆడటం మాకు సానుకూల అంశం. అలాంటి ఆటగాడు మాకెప్పటికీ అవసరమే. ఇక ఆఖర్లోనూ మా వాళ్లు బాగానే పరుగులు చేశారు" అని రోహిత్​ శర్మ తెలిపాడు.

బుమ్రా కీలకం..

boult-bumrah
బౌల్ట్​-బుమ్రా

"మ్యాచ్​ను ఇలా ముగించడం చాలా సంతోషం. ఆఖరి వరకు నమ్మకంతో ఉండటం ఎంత ముఖ్యమో తెలిసింది. చివరి నాలుగు ఓవర్లు అద్భుతంగా విసిరాం. బుమ్రా కీలక పాత్ర పోషించాడు. రస్సెల్‌ క్యాచ్‌ను జారవిడిచినందుకు అతడు నిరాశపడ్డాడు. కానీ మేం ఆటలో తిరిగి పుంజుకొనేందుకు అతడే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. మా స్పిన్నర్లకు ఎంతో అనుభవం ఉంది. వాళ్లు పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఇలాంటి వికెట్లపై ఆడటం సులభం కాదు. ఆఖర్లో రెండుమూడు వికెట్లు తీస్తే గెలుస్తామని అనిపించింది" అని ట్రెంట్​ బౌల్ట్​ అభిప్రాయపడ్డాడు.

గెలుపు ముంగిట బోల్తా..

ian morgan
ఇయాన్ మోర్గాన్

"ఈ ఓటమి నిరాశ కలిగించినా మేం నాణ్యమైన క్రికెట్‌ ఆడాం. లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపించాం. కానీ ప్రత్యర్థి బలమైన జట్టని గమనించాలి. కొన్ని పొరపాట్లు చేశాం. వాటిని సరిదిద్దుకుంటాం. ఆఖరి పది ఓవర్లు ఉత్కంఠగా సాగాయి. ఆట సాగే కొద్దీ పిచ్‌ నెమ్మదించిందో లేదో అర్థం కాలేదు. ముంబయితో గత మ్యాచ్​లో బెంగళూరూ ఛేదనలో ఇబ్బంది పడింది. ఏబీ డివిలియర్స్‌ వారిని ఆదుకున్నాడు. మేమిక్కడ గెలుపు ముంగిట బోల్తా పడ్డాం. కృనాల్‌ తెలివిగా బంతులేశాడు. అతడి బౌలింగ్‌లో రస్సెల్‌ క్యాచ్‌ను బుమ్రా జారవిడవడం వల్ల విజయంపై ఆశలు కలిగాయి" అని కోల్​కతా సారథి మోర్గాన్ తెలిపాడు.

ఇదీ చదవండి: 205 మ్యాచ్​ల్లో 2 సార్లు మాత్రమే ముంబయిపై అలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.