Sai Sudarshan hit wicket: ఐపీఎల్ మెగా టీ20 లీగ్ 15వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అద్భుత క్యాచ్‌లు, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలే కాదు.. కొన్ని వింతలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ముంబయి ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ వినూత్న రీతిలో ఔటయ్యాడు. ఇలా ఒక ఆటగాడు తన వికెట్‌ను సమర్పించుకోవటం క్రికెట్లో అరుదుగా జరుగుతుంటుంది. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో కీలక సమయంలో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు సాయి. దీంతో ఇలా కూడా అవుటవుతారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైంది. ముంబయి నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించే దశ నుంచి వరుసగా వికెట్లు సమర్పించుకుని 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది టైటాన్స్. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(55), శుభమన్ గిల్(52) పోరాటం వృథాగా పోయింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ 16వ ఓవర్ వేయగా.. చివరి బంతిని పుల్ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన సుదర్శన్ వెనక్కి తిరిగి తన బ్యాట్‌తో వికెట్లను గిరాటేశాడు. దాంతో హిట్ వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. మ్యాచ్ సమయంలో సాయి సుదర్శన్‌కు అవతలి ఎండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా సైతం 2020 సీజన్లో ఇలాగే హిట్ వికెట్ అయ్యాడు.
- — Jemi_forlife (@jemi_forlife) May 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Jemi_forlife (@jemi_forlife) May 6, 2022
">— Jemi_forlife (@jemi_forlife) May 6, 2022
ఐపీఎల్ 2022 సీజన్లో సాయి సుదర్శన్ తొలి హిట్ వికెట్ కావటం విశేషం. అయితే.. ఐపీఎల్ చరిత్రలో హిట్ వికెట్ రూపంలో ఔట్ కావటం పలు సందర్భాల్లో జరిగింది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో(2021), రషీద్ ఖాన్(2020), రియాన్ పరాగ్(2019) ఇలాగే అవుటయ్యారు.
ఇదీ చూడండి: కఠిక పేదరికం.. కడుపు నిండా తిండి లేని దైన్యం.. కల మాత్రం ఒక్కటే