Rohit Sharma: భారత్‌లో జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతోన్న ముంబయి జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ ధైర్యం నూరిపోశాడు. సీజన్ ఆరంభంలోనే మూడు వైఫల్యాలు ఎదురవడం వల్ల ఆటగాళ్లు డీలా పడొద్దని సూచించాడు. తిరిగి బలంగా పుంజుకోవాలని స్ఫూర్తి నింపాడు. గతేడాది ముంబయి పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటి ముఖం పట్టింది.
అయితే, ప్రస్తుత సీజన్‌లోనూ ఆడిన మూడింటిలో ఆ జట్టు విఫలమైంది. అవి కూడా గెలవాల్సిన మ్యాచ్‌లను కోల్పోయింది. ముఖ్యంగా బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 15 ఓవర్ల వరకూ మెరుగైన స్థితిలోనే నిలిచిన ఆ జట్టు.. 16వ ఓవర్‌లో కుదేలైంది. సామ్స్ బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్ (56 నాటౌట్; 15 బంతుల్లో 4x4, 6x6) ఒకే ఓవర్‌లో 35 పరుగులు రాబట్టడం వల్ల ముంబయి ఆటగాళ్లు డీలా పడ్డారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం వారితో మాట్లాడిన హిట్‌మ్యాన్.. గెలిచినా, ఓడినా ఒక జట్టుగానే బాధ్యత తీసుకుంటామని తెలిపాడు.
"మనం ఇక్కడ ఏ ఒక్కర్నీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. ముంబయి గెలిచినా, ఓడినా సమష్టిగానే బాధ్యత తీసుకుంటాం. అయితే, ఇకపై మనలో కాస్త తెగింపు ఉండాలని అనుకుంటున్నా. ప్రత్యర్థుల కన్నా మనం ముందుండాలి. అది సాధించాలంటే మనమంతా గెలవాలన్న కసి, తెగింపుతో ఆడాలి. మనం ఇక్కడ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని ఓడించినవారిని తిరిగి ఓడించాలి. కీలక సమయాల్లో మరింత మెరుగ్గా ఆడదాం. తర్వాత ఏం జరగనుందో వేచి చూద్దాం" అని రోహిత్ ఆటగాళ్లలో ధైర్యం నూరి పోరిశాడు. కాగా, శనివారం ముంబయి.. బెంగళూరుతో తర్వాతి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
ఇవీ చూడండి:
సచిన్నే వెనక్కినెట్టిన పాక్ క్రికెటర్.. కోహ్లీ కంటే వెనకే!
మరో టైటిల్ వేటలో దూసుకెళ్తున్న సింధు.. సెమీస్లో శ్రీకాంత్
ఈ 'ఛాంపియన్స్'కు ఈసారి ఏమైంది? హ్యాట్రిక్ ఓటములతో అట్టడుగున..