Rohit Sharma fan arrest: ఐపీఎల్ మెగా లీగ్లో గత శనివారం ఆర్సీబీతో ముంబయి తలపడింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది రోహిత్ సేన. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సెక్యూరిటీ కళ్లు గప్పి రోహిత్ శర్మ అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే ఇప్పుడా అభిమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మైదానంలోకి ప్రవేశించిన రోహిత్ అభిమాని సితారా జిల్లాలోని ఖండాలా తాలుకాకు చెందిన దర్షత్ జాధవ్గా గుర్తించారు పోలీసులు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించడం సహా గ్రౌండ్ నుంచి తనను తీసుకెళ్లేందుకు వచ్చిన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 447, 353 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.
-
Dream Come True For That Guy...@ImRo45 Ko Itna Paas Se Dekhna🥵🥶...Pta Nhi Mera Number Kb Aaega 😥😩...Between Congratulations Whoever You Are...#RohitSharma𓃵 #MIvRCB #IPL2022 pic.twitter.com/QVOXctz2pp
— Garvit Sharma (@roAddictor_45) April 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dream Come True For That Guy...@ImRo45 Ko Itna Paas Se Dekhna🥵🥶...Pta Nhi Mera Number Kb Aaega 😥😩...Between Congratulations Whoever You Are...#RohitSharma𓃵 #MIvRCB #IPL2022 pic.twitter.com/QVOXctz2pp
— Garvit Sharma (@roAddictor_45) April 10, 2022Dream Come True For That Guy...@ImRo45 Ko Itna Paas Se Dekhna🥵🥶...Pta Nhi Mera Number Kb Aaega 😥😩...Between Congratulations Whoever You Are...#RohitSharma𓃵 #MIvRCB #IPL2022 pic.twitter.com/QVOXctz2pp
— Garvit Sharma (@roAddictor_45) April 10, 2022
" హెచ్చరికలు చేస్తున్నా వినకుండా కంచెపైనుంచి దూకి మైదానంలోకి ప్రవేశించాడు. తొలుత విరాట్ వైపు వెళ్లిన అతను.. రోహిత్ వైపు తిరిగాడు. ఆ వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అతడిని బయటకు పంపించారు. మైదానం నుంచి బయటకి తీసుకొస్తున్న సమయంలో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించటం సహా గందరగోళం సృష్టించాడు. అందుకే అతడిని అరెస్ట్ చేశాం."
- మధుకర్ సావంత్, తెలేగావూన్ దభేడ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్.
ఏం జరిగిందంటే: ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు హిట్ మ్యాన్. అదే సమయంలో సెక్యూరిటీ కళ్లు గప్పి ఓ అభిమాని రోహిత్ వైపు దూసుకొచ్చాడు. హగ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. మామూలు రోజుల్లో రోహిత్ ఇచ్చేవాడేమో? అయితే కరోనా నేపథ్యంలో కాస్త పరిణతితో ఆలోచించాడు. ఆ అభిమాని తనవైపు వస్తుండటం చూసి.. మైదానం వీడి వెళ్లిపోవాలని అతడికి సూచించాడు. అతడు మాత్రం హగ్ కోసం రోహిత్ వైపే వెళ్తున్నాడు. అయితే ఇది కరోనా టైం అని.. వర్చువల్ హగ్ ఇస్తున్నట్లు చేతులు చాచాడు. ఆ ఫ్యాన్ కూడా చేతులు చాచి ఆనందంగా వెనక్కి మళ్లాడు. అయితే ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అభిమానిని రోహిత్ డీల్ చేసిన విధానం చూసి ఫిదా అయ్యాడు. రోహిత్ వైపు చూసి క్లాప్స్ కొడుతూ అభినందిస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదీ చూడండి: మైదానంలోకి రోహిత్ అభిమాని.. కోహ్లీ ఫిదా.. ఏం చేశాడంటే?