ETV Bharat / sports

పాపం రిషభ్​ పంత్​.. అత్యాశకు పోయి రూ.కోట్లలో నష్టపోయాడు.. - Mrinank Singh duped Pant

టీమ్​ ఇండియా స్టార్​ ప్లేయర్​, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్​ పంత్ దారుణంగా మోసపోయాడు. గుడ్డిగా నమ్మి ఒక‌టి కాదు. రెండు కాదు.. ఏకంగా రూ.1.63 కోట్లను న‌ష్ట‌పోయాడు. తక్కువ ధ‌ర‌కు విలాస వంతమైన వస్తువులు వస్తాయని ఆశపడితే.. మొదటికే మోసం వచ్చింది.

Rishabh Pant
రిషభ్​ పంత్
author img

By

Published : May 24, 2022, 1:14 PM IST

'అత్యాశ కొంపకు చేటు' అంటారు పెద్దలు. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన నేపథ్యంలో.. ఆ సామెత టీమ్​ ఇండియా స్టార్​ ప్లేయర్​ రిషభ్​ పంత్​కు సరిగ్గా సరిపోతుంది. తక్కువ ధ‌ర‌కు విలాస వంతమైన వస్తువులు వస్తాయని ఆశపడిన పంత్​కు.. రూ. కోట్లలో ఎగనామం పెట్టాడు ఓ వ్యక్తి. దాదాపు రూ.1.63కోట్లకు టోపీ పెట్టేశాడు.

అసలేమైంది?

జనవరి 2021లో మ్రినాంక్ సింగ్​ అనే లోకల్​ క్రికెటర్​.. రిషభ్ పంత్‌తో పాటు అతని మేనేజర్ పునీత్ సోలంకిని కలిశాడు. తాను ఓ కొత్త వ్యాపారం మొదలెట్టానని ఖరీదైన లగ్జరీ వాచ్​లు, బ్యాగులు, జ్యూవెలరీని కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తుంటానని చెప్పాడు. తాను చాలామంది క్రికెటర్లకు ఇలా వాచ్​లు అమ్మినట్టు నమ్మబలికాడు. పాత వాచ్​లో ఎక్కవ ధరకు అమ్మిబెట్టి.. తక్కువ ధరకు ఖరీదైన వాచీలు ఇప్పిస్తానని మృణాక్ సింగ్ పేర్కొన్నాడు.

ఆ మాటలను నమ్మిన రిషభ్​ పంత్.. అతనికి ఓ ఖరీదైన వాచ్​తోపాటు.. కొన్ని బంగారు నగలను అందించాడు. రిషభ్ పంత్ నుంచి రీసేల్ నిమిత్తం వాటిని కొనుగోలు చేసినట్టుగా రూ.1.63 కోట్లకు మృణాక్ సింగ్ చెక్కు ఇచ్చాడు. అయితే బోగస్​ చెక్కు అని తర్వాత తేలింది. ఈ క్రమంలో తాను మోసపోయానని తెలుసుకున్న పంత్​.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మృణాక్ సింగ్ ఇంత‌కుముందు ఒక వ్యాపారిని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు ముంబయి ఈ కేసుపై ఏడాదికి పైగా విచారణ జరగగా.. అతన్ని అరెస్టు చేసిన జుహు పోలీసులు.. అతని దగ్గర నుంచి రూ.6 లక్షల నగదు రికవరీ చేశారు.

ఇదీ చదవండి: 'సలార్'​ షూటింగ్​లో ప్రభాస్ పిక్స్ లీక్.. కంగారులో యూనిట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.