ETV Bharat / sports

RCB vs PBKS: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆర్​సీబీ - who won the toss today

ఐపీఎల్​ 2021లో (IPl 2021 news) భాగంగా నేడు (అక్టోబర్ 3) రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్​సీబీ), పంజాబ్​ కింగ్స్ (RCB vs PBKS) మధ్య మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్​ ఎంచుకుంది.

ipl 2021
ఆర్​సీబీ X పంజాబ్ కింగ్స్
author img

By

Published : Oct 3, 2021, 3:04 PM IST

Updated : Oct 3, 2021, 3:22 PM IST

ఐపీఎల్​ 2021లో (IPL 2021 News) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తొలిసారి ఐపీఎల్​ టైటిల్​ కోసం ఉవ్విళ్లూరుతున్న రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్​సీబీ), పంజాబ్​ కింగ్స్​ (RCB vs PBKS) తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్​ గెలిచిన బెంగళూరు (RCB Won The Toss) బ్యాటింగ్​ ఎంచుకుంది.

గెలిస్తే ప్లేఆఫ్స్​కే..

ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ ఎంతో కీలకం. ఇందులో విజయం సాధిస్తే కోహ్లీసేన ప్లేఆఫ్స్‌ బెర్తును (IPL Play Offs) ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికే 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. పంజాబ్‌ను ఓడిస్తే ఏ అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్తుంది. మరోవైపు పంజాబ్‌ 10 పాయింట్లతో కొనసాగుతుండటంతో టాప్‌4లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ తప్పక గెలవాలి.

బెంగళూరు జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతోంది (RCB vs PBKS Playing 11). పంజాబ్​లో ఫేబియన్ బదులు హర్​ప్రీత్, హుడా స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, ఎలిస్ స్థానంలో హెన్రిక్స్​ ఆడనున్నారు.

జట్లు:

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), దేవ్​దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్, డేనియెల్‌ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌.

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కీపర్/కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మార్​క్రమ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, షారుక్​ ఖాన్, హెన్రిక్స్, హర్​ప్రీత్ బ్రార్, మహ్మద్ షమి, రివి బిష్ణోయ్, అర్ష్​దీప్​ సింగ్

Last Updated : Oct 3, 2021, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.