IPL 2022 Mayank Agarwal: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దూరమయ్యాడు. అందుకే శిఖర్ ధావన్.. అతడి స్థానంలో టాస్‌కు వచ్చాడు.
ప్రాక్టీస్ సమయంలో కాలి గాయం కారణంగా మయాంక్ మ్యాచ్‌కు దూరమైనట్లు టాస్ సమయంలో శిఖర్‌ధావన్ తెలిపాడు. పుణెలో బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు మయాంక్ అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని ధావన్ అన్నాడు. మయాంక్ స్థానంలో ప్రభసిమ్రాన్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో అతడికి ఇదే తొలి మ్యాచ్. గత మూడు సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున అతడు ఐదు మ్యాచులు ఆడాడు.
ఇవీ చూడండి: 'భారత్‌కు ప్రపంచకప్ అందించడమే నా లక్ష్యం'
బంతులా అవి బుల్లెట్లా?.. 145 కి.మీకిపైగా వేగంతో విసిరిన వీరులు వీరే!