ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్ కొత్త సీజన్​ కోసం ప్లాన్-బీ!

IPL news: తర్వాతి సీజన్​ కోసం ఇప్పటినుంచ్ ప్లాన్ సిద్ధం చేస్తుంది భారత క్రికెట్ బోర్డు. అలానే ప్లాన్-బీ విషయమై జట్టు యాజమాన్యాలతో త్వరలో చర్చించనుంది.

author img

By

Published : Dec 23, 2021, 5:31 AM IST

IPL 2022
ఐపీఎల్

ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అప్రమత్తమైంది. ఐపీఎల్​ కొత్త సీజన్​ ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితులు ఇలానే కొనసాగితే ఏం చేయాలనేది ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ప్లాన్-బి కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జట్ల యాజమాన్యాలతో జరిగే సమావేశంలో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.

ఇంతకీ ఏంటీ ప్లాన్-బీ?

గత రెండు ఐపీఎల్​ సీజన్లు యూఏఈలోనే జరిగాయి(2021లో తొలి అర్ధభాగం మినహా). అది కూడా ఓ సీజన్​ ప్రేక్షకుల్లేకుండా మరోసారి కొంతమంది సమక్షంలో మ్యాచ్​లు నిర్వహించారు. దీంతో తర్వాతి సీజన్​ ఎలా అయినా సరే స్వదేశంలో జరపాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది.

BCCI
బీసీసీఐ

షెడ్యూల్ ప్రకారం 2022 ఏప్రిల్ 2న చెన్నైలో తొలి మ్యాచ్​ జరగాలి. కరోనా ప్రభావం ఏ మాత్రం ఎక్కువైనా సరే బీసీసీఐ ప్రత్యామ్నయం ఆలోచించాల్సిందే. అయితే గతంలో చేసినట్లు యూఏఈలో మాత్రం టోర్నీని నిర్వహించకపోవచ్చు.

ఒకవేళ ఏమైనా పరిస్థితి చేయిదాటితే ముంబయి, పుణె, అహ్మదాబాద్, బరోడా, రాజ్​కోట్ నగరాల్లోని స్టేడియాల్లో మాత్రమే టోర్నీ జరపాలనే ప్రతిపాదన కూడా ఉంది. మరి చివరగా ఏం తేలుస్తారో చూడాలి.

అలానే బెంగళూరు వేదికగా ఐపీఎల్​-2022 మెగా వేలం ప్రక్రియ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.