ETV Bharat / sports

అసలే వరుస ఓటముల బాధలో దిల్లీ.. ఇప్పుడు కెప్టెన్​ పంత్​కు.. - పంత్​కు జరిమానా

Pant Fined: ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ వరుసగా రెండో మ్యాచ్​ ఓడిపోయింది. లఖ్​నవూ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం చెంది.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇప్పుడు కెప్టెన్​ పంత్​కు భారీ జరిమానా విధించారు ఐపీఎల్​ నిర్వాహకులు. ఎందుకో తెలుసా?

Pant fined for DC's slow over rate against LSG

author img

By

Published : Apr 8, 2022, 10:17 AM IST

Updated : Apr 8, 2022, 10:41 AM IST

Pant Fined: దిల్లీ క్యాపిటల్స్​కు మరో షాక్​ తగిలింది. కెప్టెన్​ రిషభ్​ పంత్​కు రూ. 12 లక్షల జరిమానా విధించారు ఐపీఎల్​ నిర్వాహకులు. గురువారం లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్​ కారణంగా ఈ ఫైన్​ విధించారు. ''నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు దిల్లీ కెప్టెన్​ రిషభ్​ పంత్​కు రూ. 12 లక్షల ఫైన్​ వేశాం. ఐపీఎల్​ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల్లో దిల్లీ చేసిన మొదటి తప్పు ఇది.'' ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే వరుస ఓటములతో తల్లడిల్లుతున్న దిల్లీకి.. ఇది మరో దెబ్బ. గురువారం జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది పంత్​ టీం. తొలుత బ్యాటింగ్​ చేసిన దిల్లీ క్యాపిటల్స్​ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. 3 వికెట్లే కోల్పోయినా.. ఎక్కువ స్కోరు చేయలేకపోయింది. పృథ్వీ షా(61) మినహా ఎవరూ రాణించలేదు. పంత్​(39), సర్ఫ్​రాజ్​ ఖాన్​(36) చాలా నెమ్మదిగా ఆడారు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్​నవూ.. సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్​ డికాక్​(80) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అతడికే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ దక్కింది. పాయింట్ల పట్టికలో లఖ్​నవూ రెండో స్థానానికి చేరగా.. దిల్లీలో ఏడులో కొనసాగుతోంది. ఐపీఎల్​లో భాగంగా.. శుక్రవారం పంజాబ్​ కింగ్స్​, గుజరాత్​ టైటాన్స్​ తలపడనున్నాయి. ముంబయి బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ జరగనుంది.

ఇవీ చూడండి: IPL 2022: దంచికొట్టిన డికాక్.. దిల్లీపై లఖ్​నవూ ఘన విజయం

మోడలింగ్​తో మతిపోగొడుతున్న రెజ్లింగ్ భామ

జడ్డూ ఏదైనా చేయగలడు.. వైరల్​ అవుతున్న వీడియో

Last Updated : Apr 8, 2022, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.