ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రాజస్థాన్ రాయల్స్-ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐదేసి మ్యాచ్‌లాడిన ఇరు జట్లు.. చెరో రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన.. మునుపటి ప్రదర్శనను చూపలేకపోతోంది. నలుగురు విదేశీ ఆటగాళ్లు దూరమైన శాంసన్ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని భావిస్తోంది. రెండు జట్లను పరిశీలిస్తే ముంబయి జట్టు బలంగా కనిపిస్తోంది.
రోహిత్ సేన గాడిలో పడేనా?
టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ముంబయి ఇండియన్స్ గత ఫామ్‌ను చూపలేక సతమతమవుతోంది. ఓటమితో సీజన్‌ను ప్రారంభించిన రోహిత్ సేన.. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో తిరిగి విజయాలను సాధించింది. ఇక చివరి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ముంబయిని.. ప్రధానంగా మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. చివరగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైన ముంబయి.. కనీసం బౌలింగ్‌లోనూ పోరాడలేదు.
ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు 160 పరుగులు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ రోహిత్, క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్ రాణిస్తున్నప్పటికీ.. పాండ్యా సోదరులతో పాటు పొలార్డ్, డికాక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు.
ఇక బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, చాహర్ అద్భుతంగా రాణిస్తున్నారు. జాన్సెన్, కృనాల్ పాండ్యా, పొలార్డ్ వికెట్లు తీయకపోగా.. ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. సమష్టిగా రాణిస్తే రాజస్థాన్‌పై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇదీ చదవండి: రాణించిన మనీష్, వార్నర్.. చెన్నై లక్ష్యం 172
రాజస్థాన్ విజయాలను కొనసాగిస్తుందా?
యువ క్రికెటర్ సంజూ శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ జట్టు.. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచిన రాజస్థాన్.. మరో మూడింట్లో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
బ్యాటింగ్‌లో కెప్టెన్ శాంసన్, జైస్వాల్, దూబే, తెవాతియా ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. వారు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. ఓపెనర్ జాస్ బట్లర్, డేవిడ్ మిల్లర్ ఇంతవరకు ఆకట్టుకోలేకపోయారు. ఇక బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ, కమిన్స్, వరుణ్ చక్రవర్తి రాణిస్తున్నప్పటికీ.. ధారళంగా పరుగులు ఇస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుగ్గా రాణిస్తేనే రోహిత్ సేనపై విజయం సాధించొచ్చు. లేకపోతే కష్టమే మరి.
గాయాల కారణంగా ఇప్పటికే జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ సేవలను కోల్పోయిన రాజస్థాన్ జట్టు మరో ఇద్దరు ఆటగాళ్లను కోల్పోయింది. కరోనా భయాలతో లివింగ్‌స్టోన్‌తో పాటు ఆండ్రూ టై.. స్వదేశానికి వెళ్లిపోయారు. వీరి ప్రభావం కూడా జట్టుపై పడనుంది.
ఇదీ చదవండి: ఐపీఎల్లో వార్నర్ రికార్డు.. తొలి ఆటగాడిగా ఘనత