ETV Bharat / sports

రాణించిన బట్లర్​, శాంసన్​.. ముంబయి లక్ష్యం 172

author img

By

Published : Apr 29, 2021, 5:14 PM IST

ముంబయి ఇండియన్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్ రాయల్స్​ జట్టు బ్యాటింగ్​లో అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులను చేసింది. దీంతో 172 రన్స్​ లక్ష్యాన్ని ముంబయి ఛేదించాల్సి ఉంది.

MI vs RR match
ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్

దిల్లీ వేదికగా ముంబయి ఇండియన్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ బ్యాటింగ్​ అదరగొట్టింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో 172 రన్స్​ లక్ష్యాన్ని ముంబయి ఛేదించాల్సి ఉంది. రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​ సంజూ శాంసన్​(42) టాప్​ స్కోరర్.

ఓపెనర్లు జోస్​ బట్లర్​(41), యశస్వీ జైశ్వాల్​(32) జట్టుకు శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(42), శివమ్​ దూబే(35) కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో బ్యాటింగ్​ చేసిన రియాన్​ పరాగ్​(7), డేవిడ్​ మిల్లర్​(8) ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లు రాహుల్​ చాహర్​ 2, ట్రెంట్ బౌల్ట్​ , బుమ్రా చెరో ఒక వికెట్​ను పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.