ఐపీఎల్ మ్యాచ్ రిఫరీగా పనిచేస్తోన్న మనూ నాయర్.. తన తల్లి మరణం తర్వాత బయోబబుల్ను వీడాడు. ఆయన చివరిసారిగా దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించాడు.
రంజీల్లో దిల్లీ జట్టు తరఫున ఆడిన మనూ నాయర్.. అహ్మదాబాద్, ముంబయి వేదికగా ఈ సీజన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లకు రిఫరీగా పనిచేశాడు. తన తల్లిని కడసారిగా చూసేందుకు గురువారం దిల్లీ బయల్దేరి వెళ్లాడు మనూ నాయర్. అయితే ఆమె ఏ కారణంగా మరణించారనేది తెలియలేదు.
అంతకుముందు భారత్కు చెందిన అంపైర్ నితిన్ మేనన్తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్.. లీగ్ నుంచి తప్పుకున్నారు. తన కుటుంబం కరోనా బారిన పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు మేనన్. ఆసీస్ ప్రభుత్వం.. ప్రయాణ ఆంక్షలు విధించడం వల్ల రీఫెల్ నిష్క్రమించాడు. వీరితో పాటు ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్, ఆడమ్ జంపా, కేన్ రిచార్డ్సన్ ఐపీఎల్ నుంచి ఇప్పటికే తప్పుకున్నారు.
ఇదీ చూడండి.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఇద్దరు అంపైర్లు