CSK vs SRH match preview: డిఫెండింగ్ ఛాంపియనే కానీ చెన్నై ఆరంభం పేలవం. ఇంకా పాయింట్ల ఖాతానే తెరవలేదు. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా నేతృత్వంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. కోల్‌కతా, లఖ్‌నవూ, పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసిన ఆ జట్టు అన్ని రంగాల్లోనూ మెరుగుపడాల్సివుంది. ఈ నేపథ్యంలో చెన్నై మరో పోరాటానికి సిద్ధమైంది. శనివారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.హైదరాబాద్ పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. చెన్నై లాగే టోర్నీలో ఇంకా బోణీ కొట్టలేదు. కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. మొదట రాజస్థాన్, ఆ తర్వాత లఖ్‌నవూ చేతిలో భంగపడ్డ హైదరాబాద్ సీజన్‌లో తొలి విజయం కోసం తహతహలాడుతోంది. మరి చెన్నై, హైదరాబాద్ లో ఏ జట్టు బోణీ కొడుతుందో చూడాలి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 16 సార్లు తలపడగా 12 విజయాలతో చెన్నై పైచేయిలో ఉంది.
MI vs RCB match preview: శనివారం జరిగే మరో మ్యాచ్‌లో ముంబయి జట్టు.. డుప్లెసిస్ సారథ్యంలోని బెంగళూరును ఢీకొంటుంది. ముంబయి కూడా టోర్నీలో ఇప్పటివరకు విజయాన్నందుకోలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ముంబయి నెగ్గాలంటే సమష్టిగా రాణించాల్సివుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ఫామ్‌ను అందుకోవడం ఆ జట్టుకు చాలా అవసరం. అయితే ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉండడం, యువ ఆటగాడు తిలక్ వర్మ సత్తా చాటుటుండడం ముంబయికి సానుకూలాంశాలు. మరో వైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు నెగ్గిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌తో గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెలక్షన్‌కు అందుబాటులో రానుండడం బెంగళూరుకు పెద్ద సానుకూలాంశం.
ఇదీ జరిగింది: IPL 2022: ఐపీఎల్‌కు తగ్గిన వీక్షకుల సంఖ్య