ETV Bharat / sports

కరోనా నుంచి కోలుకున్న కిరణ్​ మోరే

ఇటీవలే కరోనా వైరస్​ బారిన పడిన ముంబయి ఇండియన్స్​ వికెట్​ కీపింగ్​ సలహాదారు కిరణ్​ మోరే పూర్తిగా కోలుకున్నారని యాజమాన్యం వెల్లడించింది. త్వరలోనే అతడు బయోబబుల్​లో అడుగుపెడతాడని ఫ్రాంఛైజీ ట్విట్టర్​లో తెలిపింది.

Kiran More recovers from COVID-19
కిరణ్​ మోరే
author img

By

Published : Apr 21, 2021, 8:50 PM IST

ముంబయి ఇండియన్స్​ వికెట్​ కీపింగ్​ సలహాదారు కిరణ్​ మోరేకు కరోనా నెగిటివ్​గా తేలింది. ఏప్రిల్​ 6న వైరస్​ బారిన పడిన ఈ మాజీ ఆటగాడు.. కోలుకున్నట్లు జట్టు యాజమాన్యం బుధవారం వెల్లడించింది.

"కిరణ్​ మోరే కొవిడ్​-19 బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన ఐసోలేషన్​ పూర్తైంది. మూడుసార్లు చేసిన ఆర్టీ-పీసీఆర్​ పరీక్షల్లో మోరేకు నెగిటివ్​ వచ్చింది".

- ముంబయి ఇండియన్స్​ ట్వీట్​

"బీసీసీఐని సంప్రదించిన తర్వాత కిరణ్​ మోరేను జట్టులోకి చేర్చుకుంటాం. బోర్డు నిబంధనలను అనుసరించి ముంబయి ఇండియన్స్ బయోబబుల్​లోకి ఆయనను ఆహ్వానిస్తాం" అని ఫ్రాంచైజీ మరో ట్వీట్​లో వెల్లడించింది.

ఇదీ చూడండి: 'జట్టులో అతనొక్కడికే.. మిగతావారికి నెగటివ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.