ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 1000 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. 26 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టో(38: 18 బంతుల్లో 6 x4, 4 x3) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
షాన్ మార్ష్(ఆస్ట్రేలియా, 21 ఇన్నింగ్స్), లెండ్ సైమన్స్(వెస్ట్ఇండీస్, 23 ఇన్నింగ్స్), మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా మాజీ, 24 ఇన్నింగ్స్) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
బెయిర్ స్టోను ఎందుకు తీసుకోలేదు?
చెపాక్ వేదికగా జరిగిన దిల్లీ- హైదరాబాద్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 పరుగులే చేయగా, అనంతరం దిల్లీ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే హైదరాబాద్ తరఫున వార్నర్, విలియమ్స్‌న్ సూపర్ ఓవర్ బ్యాటింగ్ దిగారు. దీనిపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. బెయిర్ స్టోను ఎందుకు ఫస్ట్ ఛాయిస్‌గా తీసుకోలేదని ప్రశ్నించాడు. వింత నిర్ణయాలను తీసుకున్నందుకు తమకు తామే నిందించుకోవాలని అన్నాడు. సన్‌రైజర్స్ జట్టు బాగా ఆడిందని ప్రశంసించాడు.