ETV Bharat / sports

IPL final 2022: ఈ ఫైనల్స్​​ వెరీ స్పెషల్​.. ఎందుకంటే?

IPL final 2022: ఐపీఎల్​ లీగ్​ పతాక ఘట్టానికి రంగం సిద్ధమైంది. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌ కప్పు కోసం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2008 తర్వాత మళ్లీ ఫైనల్స్​లోకి అడుగుపెట్టిన రాయల్స్​ విజయం సాధిస్తుందా? లేక జోరు మీద ఉన్న గుజరాత్​ టైటాన్స్​ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. అంతేకాదు అన్ని సీజన్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిచిన ఈ ఫైనల్స్​లో​ పలు రికార్డులు నమోదు కానున్నాయి. అవేంటో తెలుసా?

hardik pandya
hardik pandya
author img

By

Published : May 29, 2022, 12:05 PM IST

Updated : May 29, 2022, 12:20 PM IST

IPL final 2022: ఆఖరి ఓవర్​ వరకు ఉత్కంఠ.. సిక్సులు, ఫోర్లు బాదుతూ బ్యాట్స్​మెన్​ విధ్వంసకర ఇన్నింగ్స్​.. స్పిన్​, పేస్​లతో బౌలర్ల ఎదురుదాడి. ఐపీఎల్​ వచ్చిందంటే చాలు ఇవన్నీ చూస్తూ క్రికెట్​ అభిమానులకు ఫుల్​మీల్స్​ తిన్నట్టు ఉంటుంది. పొట్టి క్రికెట్​ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఐపీఎల్​.. ప్రతిసీజకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్​ ఐపీఎల్​ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

  • ఈ ఏడాది ఐపీఎల్​లో ఏకంగా 10 జట్లు బరిలోకి దిగాయి. దీంతో మ్యాచ్​లు రసవత్తరంగా సాగాయి. కొత్త జట్లే కదా అని అనుకున్న లఖ్​నవూ సూపర్​జయంట్స్​, గుజరాత్​ టైటాన్స్​.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టించాయి. ​బడా జట్లపైన కూడా ఆధిపత్యం ప్రదర్శించాయి.
  • గుజరాత్​, లఖ్​నవూ జట్లు టాప్​-4లో నిలవడం ఒక ఎత్తు అయితే.. గత కొన్ని సీజన్లుగా తడబడుతున్న రాజస్థాన్​ రాయల్స్​ ఫామ్​లోకి వచ్చి మంచి ప్రదర్శన చేయడం మరో ట్విస్ట్​. బట్లర్​ భీకర ఫామ్​ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.
  • 2017 తర్వాత ముంబయి లేదా చెన్నై జట్లు లేకుండా ఫైనల్​ జరగడం ఇదే తొలిసారి.
  • ఈ నేపథ్యంలో గుజరాత్​, రాజస్థాన్​ జట్లు ఫైనల్​లో ఎలా తలపడతాయోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. ఐపీఎల్​ ముగింపు ఏర్పాట్లు తెలిస్తే ఈ ఆసక్తి మరోస్థాయికి వెళ్తుంది. కొవిడ్​ కారణంగా గత ఐపీఎల్​ ఆంక్షల మధ్య సాగింది. కానీ ఈసారి అభిమానుల కోలాహం మధ్య మ్యాచ్​ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అట్టహాసంగా ముగింపు వేడుకలను జరపాలని నిర్వహకులు ప్లాన్​ చేశారు. ఈ కార్యక్రమానికి ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

హార్దిక్​కు లక్​ కలిసి వస్తుందా? -- గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​గా హార్దిక్​ పాండ్య ఈ సీజన్ అద్భుతంగా రాణించాడు. అయితే నెట్టింట ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. హార్దిక్​ ఇప్పుటివరకు ఆడిన ఏ ఫైనల్​లో కూడా ఓడిపోలేదని చెప్పుకుంటున్నారు. 2015లో ఐపీఎల్​లోకి అడుగుపెట్టిన పాండ్య.. ముంబయి ఇండియన్స్​ తరఫున నాలుగు ఫైనల్స్​ ఆడాడు. ఈ నాలుగు మ్యాచుల్లోనూ ముంబయి విన్నర్​గా నిలిచింది. మరి ఇప్పుడు గుజరాత్​ కెప్టెన్​గా హార్దిక్​కు ఈ లక్​ కలిసివస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ ఫైనల్​లో విజయం సాధిస్తే.. అత్యంత వేగంగా ఐపీఎల్​ టైటిల్​ సాధించిన పూర్తిస్థాయి కెప్టెన్​గా హార్దిక్​ రికార్డు సృష్టిస్తాడు.

hardik pandya
హార్దిక్​ పాండ్య

రాజస్థాన్​ రాజసం ఉంటుందా?-- తొలి సీజన్​ తర్వాత మళ్లీ ఫైనల్​లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకోని రాజస్థాన్​ రాయల్స్​కు.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టైటిక్​ కొట్టే అవకాశం వచ్చింది. అటు బ్యాటింగ్​.. ఇటు బౌలింగ్​తో మెప్పిస్తున్న ఈ జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు దక్కించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉంది. తొలి సీజన్​లో కప్పు అందించిన కెప్టెన్​ షేన్​వార్న్​కు నివాళిగా ఈ టైటిల్​ కొట్టాలని సంజూశాంసన్​ సేన భావిస్తోంది.

hardik pandya
రాజస్థాన్​ రాయల్స్

సొంతగడ్డపై మ్యాచ్​ చూసేందుకు..: ఈ ఫైనల్స్​ను చూసేందుకు వచ్చే ప్రముఖులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా ఏఆర్​ రెహమాన్​, రణ్​వీర్​ సింగ్​ వంటి సినీ ప్రముఖులు ఉన్నారు. రణ్​వీర్​, రెహమాన్​లు ముగింపు వేడుకల్లో తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ మ్యాచ్​కు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు హాజరవుతుండటం గుజరాత్​ జట్టులో మరింత జోష్​ను నింపనుంది. అతిపెద్ద స్డేడియం కావడం వల్ల లక్షల మంది అభిమానులు ఈ మ్యాచ్​ను వీక్షించేందుకు రానున్నారు. మోదీ, షా కూడా వస్తుండటంతో స్టేడియం దద్దరిల్లే అవకాశముంది. ఈ మ్యాచ్​కు సంబంధించి టికెట్లు కూడా ఇప్పుటికే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.

ప్రపంచ క్రికెట్​లోనే రికార్డ్​!.. అహ్మదాబాద్​ వేదికగా జరగనున్న ఈ ఫైనల్​లో మరో రికార్డ్​ నమోదు కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన మోతేరా స్టేడియానికి.. ఫైనల్స్​ సందర్భంగా భారీ ఎత్తున ప్రేక్షకులు రానున్నారు. పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతి ఉన్న నేపథ్యంలో ఈ హాజరయ్యే వారి సంఖ్య 1,25,000 ఉంటుందని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్​ చూడనుండటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇది కేవలం ఐపీఎల్​లోనే కాదు ప్రపంచ క్రికెట్​లోనే రికార్డు కానుంది.

ఇదీ చూడండి : 'బట్లర్​ నా రెండో భర్త'.. మరో క్రికెటర్​ భార్య షాకింగ్ కామెంట్స్​!

Last Updated : May 29, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.