ETV Bharat / sports

RCB vs SRH : కీలక మ్యాచుల్లో 7 సార్లు సన్​రైజర్సే.. మరి ఆర్సీబీ ఈ సారైనా..

ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా గురువారం హైదరాబాద్, బెంగళూరు మధ్య మ్యాచ్​ జరగనుంది. హైదరాబాద్​కు ఈ మ్యాచ్​ నామమాత్రం కాగా.. బెంగళూరుకు కీలకం కానుంది. అయితే సన్​రైజర్స్​తో మ్యాచ్​ అనగానే ఆర్​సీబీ అభిమానుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎందుకంటే బెంగళూరుకు కీలకమైన మ్యాచ్​లన్నింటిలో సన్​రైజర్సే పైచేయి సాధించింది. ఆ వివరాలు..

SRH vs RCB
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు
author img

By

Published : May 18, 2023, 5:25 PM IST

Updated : May 18, 2023, 6:02 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ చరిత్రలోనే సన్​రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయా సీజన్​లలో బెంగళూరు ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించేందుకు ఆడే కీలక మ్యాచ్​లు అన్నీ ఆరెంజ్ ఆర్మీ జయాపజయాలతో ముడి పడి ఉంటాయి. ఈ క్రమంలో గురువారం(మే 18) నాటి మ్యాచ్​ కూడా అలాంటిదే. బెంగళూరు ఈ మ్యాచ్​లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేయాలనుకుంటుంది. మరి హైదరాబాద్ ఆర్​సీబీకి ఆ ఛాన్స్​ ఇస్తుందా.. లేదా ఎప్పటిలాగే వారి ఆనవాయితీని కొనసాగిస్తూ బెంగళూరుకు మరోసారి నిరాశే మిగుల్చుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్​లో ఇరు జట్లు ఇప్పటికే 22 సార్లు తలపచగా.. 12 మ్యాచ్​ల్లో సన్​రైజర్స్ గెలుపొందింది. 9 మ్యాచ్​ల్లో ఆర్​సీబీ నెగ్గింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.

2009 ఫైనల్స్​లో ఢీ:
ఐపీఎల్ ప్రారంభమైన రెండో సీజన్​ నుంచే హైదరాబాద్(అప్పటి పేరు, డెక్కన్ ఛార్జర్స్ ), బెంగళూరు జట్ల మధ్య పోరు ప్రత్యేకంగా మారింది. 2009 ఐపీఎల్ ఫైనల్స్​లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ 143 పరుగులు చేసింది. అనంతరం ఆర్​సీబీని 137కే కట్టడి చేసి టైటిల్ ఎగిరేసుకుపోయింది.

HYDERABAD VS BANGALORE
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు 2009 ఫైనల్​

2012 లీగ్ దశలోనే:
ఈ సీజన్​లో డెక్కన్ ఛార్జర్స్ తన ఆఖరి మ్యాచ్​ బెంగళూరుతో ఆడింది. అప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన డెక్కన్.. బెంగళూరుకు కీలకమైన ఆ మ్యాచ్​లో విజయం సాధించింది. ఆ ఓటమితో ఆర్​సీబీ, చెన్నైతో కలిసి 17 పాయింట్లతో సమానంగా ఉన్నా.. నెట్​రన్​రేట్ మైనస్​లో ఉన్నందున బెంగళూరు కూడా హైదరాబాద్​తో కలిసి ఇంటి బాట పట్టింది. కాగా ఆ సీజన్​లో కోల్​కతా ఛాంపియన్​గా నిలిచింది.

2013లో మరోసారి:
హైదరాబాద్​ ఫ్రాంఛైజీ మారింది ఆ సీజన్​లోనే. డెక్కన్ ఛార్జర్స్ పేరు కాస్తా 'సన్ రైజర్స్' గా మారింది. ఆ సీజన్ సన్​రైజర్స్​ తన చివరి లీగ్ మ్యాచ్​లో కోల్​కతాతో తలపడింది. ఆ మ్యాచ్​లో సన్ రైజర్స్ గెలిచి ప్లే ఆఫ్స్​లోకి దూసుకెళ్లింది. ఒకవేళ ఆ మ్యాచ్​లో హైదరాబాద్ ఓడి ఉంటే.. బెంగళూరు నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్​లో బెర్తు కన్ఫార్మ్​ చేసుకునేది.

2015లో ఓటమి చూపిన ప్రభావం:
ఐపీఎల్ సీజన్ 8లో టాప్ 2 ప్లేస్​ కోసం ముంబయి, బెంగళూరు జట్ల మధ్య టాప్​ తీవ్ర పోటీ నెలకొంది. అప్పటివరకూ హైదరాబాద్ తన చివరి మ్యాచ్​ల్లో గెలిచి బెంగళూరును నష్టపరిస్తే.. ఆ సీజన్​లో లీగ్ ఆఖరి మ్యాచ్​లో ముంబయి పై ఓడి, ఆర్​సీబీ జట్టును మూడో స్థానానికి పరిమితం చేసింది. అలా బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్​లో నెగ్గినా.. క్వాలిఫైర్ 2లో చెన్నైతో ఓడి ఇంటి ముఖం పట్టింది.

2016 ఫైనల్స్​లో:
సుమారు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్​లో ఆర్​సీబీ ఫైనల్స్​ చేరింది. ఆ సీజన్​లో భీకరమైన ఫామ్​లో ఉన్న కోహ్లీ, యూనివర్సెల్ బాస్ గేల్, మిస్టర్ 360 డివిల్లీర్స్​తో పటిష్ఠంగా ఉన్న ఆర్​సీబీదే టైటిల్ అని అనుకున్నారంతా. కానీ మొదటగా బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. స్కోర్​ బోర్డుపై 200 పై చిలుకు లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో గాడీ తప్పిన ఆర్​సీబీ ఫైనల్స్​లో మరోసారి హైదరాబాద్​ చేతిలో భంగపడింది. బెంగళూరు టైటిల్ కల.. కలలాగే మిగిలిపోయింది.

HYDERABAD VS BANGALORE
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు 2016 ఫైనల్​

2020లో ఎలిమినేటర్ పోరులో:
2020 వ సంవత్సరంలో ఇరు జట్లు ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించాయి. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఆర్​సీబీ, ఎస్​ఆర్​హెచ్​ జట్లు ఎలిమినేటర్​లో ఢీ కొన్నాయి. ఈసారైనా హైదరాబాద్​ను దెబ్బకొట్టాలని బెంగళూరు ఆశించినప్పటికీ... మరోసారి భంగపడింది. ఎలిమినేటర్ మ్యాచ్​లో ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్.. కీలక మ్యాచ్​ల్లో బెంగళూరును ఆరోసారి దెబ్బకొట్టింది.

2022లో 68కే ఆలౌట్:
గత సీజన్​లో లీగ్ దశ​లో ఆర్​సీబీ, సన్​రైజర్స్ మధ్య మ్యాచ్​ జరిగింది. ​ఈ మ్యాచ్​లో బెంగళూరు బ్యాటింగ్ లైనప్​ను సన్​రైజర్స్​ తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఆర్​సీబీని 68 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా బెంగళూరు ఐపీఎల్​లో తమ రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. విశ్వరూపం ప్రదర్శించిన నటరాజన్ ఆ మ్యాచ్​లో 5 వికెట్లు నేలకూల్చాడు.

మరి ఇప్పుడేం జరుగుతుందో:
ఈ సీజన్ ఐపీఎల్​లో జట్లను గ్రూపులుగా విభజించిన కారణంగా ఆర్​సీబీ, సన్​రైజర్స్​తో ఒకే మ్యాచ్​ ఆడనుంది. అయితే 12 మ్యాచ్​ల్లో 6 విజయాలతో 5 స్థానంలోఉన్న ఆర్​సీబీకి ఈ మ్యాచ్​ అత్యంత కీలకం. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేయాలనుకుంటుంది. మరి హైదరాబాద్ ఆర్​సీబీకి ఆ ఛాన్స్​ ఇస్తుందా.. లేదా ఎప్పటిలాగే వారి ఆనవాయితీని కొనసాగిస్తూ బెంగళూరుకు మరోసారి నిరాశే మిగుల్చుతుందా అని వేచి చూడాలి. ఈ మ్యాచ్​ ఫలితం ముంబయికి కూడా కీలకమే.

Last Updated : May 18, 2023, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.