ETV Bharat / sports

IPL 2023:  చెన్నైదే పైచేయి.. మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ మెరుపులు వృథా - ఐపీఎల్​ 2023 లేటెస్ట్ న్యూస్​

ఐపీఎల్​ 2023లో భాగంగా బెంగళూరు​​, చెన్నై మధ్య మ్యాచ్​ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్​లో బెంగళూరు టీమ్​పై ధోనీ సేన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

rcb vs csk result
rcb vs csk result
author img

By

Published : Apr 17, 2023, 10:59 PM IST

Updated : Apr 18, 2023, 6:59 AM IST

IPL 2023 : ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 16వ సీజన్​లో భాగంగా చెన్నై సూపర్​ కింగ్స్​, రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ​ చెన్నై అతి కష్టం మీద గెలుపొందింది. సోమవారం ఆ జట్టు 8 పరుగుల తేడాకు ఆర్సీబీ టీమ్​ను ఓడించింది. మొదట 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కాన్వే (83; 45 బంతుల్లో 6×4, 6×6), దూబె (52; 27 బంతుల్లో 2×4, 5×6), రహానె (37; 20 బంతుల్లో 3×4, 2×6) మెరుపులతో చెన్నై 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ (76; 36 బంతుల్లో 3×4, 8×6), డుప్లెసిస్‌ (62; 33 బంతుల్లో 5×4, 4×6) విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ ఛేదనలో దూసుకెళ్లినా.. చివరి ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడం వల్ల ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. తుషార్‌ దేశ్‌పాండే (3/45), పతిరన (2/42) బెంగళూరును దెబ్బ తీశారు.

ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ..
227 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్​లో ఓపెనర్​గా విరాట్​ కోహ్లీ మాయ చేసి రికార్డులు బద్దలు కొడతాడనుకుంటే.. కేవలం 4 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన మహిపాల్​ 5 బంతులు ఆడి డకౌట్​ అయ్యాడు. రెండు ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది బెంగళూరు జట్టు. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. ఫాఫ్​ డుప్లేసిస్​ (33 బంతుల్లో 62 పరుగులు), గ్లెన్​ మ్యాక్స్​వెల్​ (36 బంతుల్లో 76 పరుగులు) కలసి స్కోర్​ బోర్డుతో కబడ్డీ ఆడుకున్నారు. మెరుపు ప్రదర్శన చేసిన మ్యాక్స్​వెల్​ 141 పరుగుల వద్ద 13వ ఓవర్​లో పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన షహబాద్ అహ్మద్(13)​ నిలకడగా ఆడాడు. దినేశ్ కార్తీక్​ (28), చెన్నై బౌలర్లలో ఆకాశ్​ (1), తుషార్​ దేశ్​పాండే (1), మహీశ్​ తీక్షణ (1), జడేజా (1), మతీశ పతిరణ (1), మయీన్​ అలీ (1) వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు.. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు చేసిన చెన్నై​.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. చెన్నై​ బ్యాటర్​​ డేవాన్​ కాన్వే​ (83) దంచికొట్టాడు. శివమ్​ దుబే (52) హాఫ్​ సెంచరీ చేశాడు. అజింక్య రహానే​ (37), అంబటి రాయుడు (14) పరుగులు చేశాడు. ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​(3) పేలవ ప్రదర్శన చేశాడు. మెయీన్​ అలీ (19*), జడేజా (10*) పరుగులు చేశారు. బెంగళూరు​ బౌలర్లలో మహ్మద్​ సిరాజ్​ (1), పార్వెల్​ (1), విజయ్​ కుమార్​ (1), హసరంగ (1), హర్షల్​ పటేల్​ (1), మ్యాక్స్​వెల్​ (1) వికెట్లు పడగొట్టారు.

శివమ్​ దుబే సూపర్​ సిక్స్..
చెన్నై బ్యాటర్​ శివమ్​ దుబే మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్​లో వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో 13వ ఓవర్​లో.. 111 మీటర్ల భారీ సిక్స్​ను బాదాడు. దీంతో బంతి స్టేడియం పైకప్పు మీద పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Last Updated : Apr 18, 2023, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.