ETV Bharat / sports

టాస్​ గెలిచిన ముంబయి.. అర్జున్​ తెందుల్కర్​ ఎంట్రీ.. గెస్ట్​లుగా 19వేల అమ్మాయిలు! - ఐపీఎల్ 2023 అర్డున్​ తెందూల్కర్​ అరంగేట్రం

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా ముంబయి, కోల్​కతా జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ మహిళల ప్రీమియర్​ లీగ్ జేర్సీ ధరించింది. మరోవైపు, సచిన్​ తెందూల్కర్​ తనయుడు అర్జున్​ తెందూల్కర్​ ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు.

IPL 2023 Mumbai Indians vs Kolkata Knight Riders

author img

By

Published : Apr 16, 2023, 3:15 PM IST

Updated : Apr 16, 2023, 3:46 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా.. ముంబయి, కోల్​కతా జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా ముంబయి టాస్​ గెలిచి.. బౌలింగ్​ ఎంచుకుంది. ప్రత్యర్థి కోల్​కతాకు బ్యాటింగ్ అప్పగించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్​ కీపర్), వెంకటేశ్​ అయ్యర్, ఎన్ జగదీశన్, నితీశ్​ రాణా(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

ముంబయి ఇండియన్స్ తుది జట్టు: ఇషాన్ కిషన్(వికెట్​ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, అర్జున్ తెందూల్కర్​, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్

మ్యాచ్​ గెస్టులుగా 19 వేల మంది అమ్మాయిలు..
ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ప్రత్యేక జెర్సీలో కనిపిస్తుంది. మహిళల ప్రీమియర్​ లీగ్ ​(WPL) ముంబయి ఇండియన్స్​ జెర్సీని.. ఆ ఫ్రాంచైజీ పురుషుల జట్టు ధరించింది. ఈ మేరకు ముంబయి జట్టు తమ వెబ్​సైట్​లో పేర్కొంది. ఈఎస్​ఏ (ఎడ్యుకేషన్ అండ్​ స్పోర్ట్స్​​ ఫర్​ ఆల్​) దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ ఎన్​జీఓలకు చెందిన 19 వేల మంది అమ్మాయిలకు ఫ్రీ పాస్​లు ఇచ్చింది ముంబయి ఫ్రాంచైజీ. ఈ మేరకు ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ నిర్ణయం తీసుకున్నారు.

అర్జున్​ తెందుల్కర్​ అరంగేట్రం..
అర్జున్‌ తెందుల్కర్‌ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ చేతుల మీదుగా ముంబయి ఇండియన్స్​ జట్టు క్యాప్​ అందుకున్నాడు అర్జున్​. కోల్​కతా ఇన్నింగ్స్​లో మొదటి ఓవర్​ను వేశాడు. లెఫ్ట్​ ఆర్మ్​ పేసర్​ అయిన అర్జున్​ను ముంబయి జట్టు.. రూ. 30 లక్షల బేస్​ ప్రైస్​కు కొనుగోలు చేసింది. అంతకుముందు 2021లో ఇదే జట్టు రూ. 20 లక్షల బేస్​ ప్రైస్​కు కొనుగోలు చేసింది. గాయం కారణంగా అతడిని జట్టు నంచి తొలగించింది. అర్జున్​ మొదట ముంబయి తరఫున రంజీ ట్రోఫీ ఆడాడు.
ఐపీఎల్​లో ముంబయి, కోల్​కతా జట్లు ఇప్పటి వరకు ఇరుజట్లు 31 సార్లు తలపడ్డాయి. అందులో 22 మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్​ రైడర్స్​ జట్టు కూడా గట్టి పోటీనిస్తూ 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ముంబయి (9) కంటే మెరుగ్గా ఐదో స్థానంలో ఉంది.

రోహిత్​ దూరం..
ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మ ఆడటం లేదు. అస్వస్థతకు గురైన కారణంగా మ్యాచ్​కు దూరంగా ఉన్నాడు. రోహిత్​ స్థానంలో సూర్య కుమార్​ యాదవ్​ జట్టును నడిపించనున్నాడు.

Last Updated : Apr 16, 2023, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.