ETV Bharat / sports

దిల్లీ ఆలౌట్​.. అక్షర్​​, వార్నర్​​ హాఫ్​​ సెంచరీ.. ముంబయి టార్గెట్​ ఫిక్స్​ - ఐపీఎల్​ 2023

ఐపీఎల్​ 2023 సీజన్​లో భాగంగా ముంబయి​​తో జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీ బ్యాటర్లు డేవిడ్​ వార్నర్, అక్షర్​ పటేల్​ అద్భుత ప్రదర్శన చేసి హాఫ్ సెంచరీలు పుర్తి చేశారు. ముంబయి టార్గెట్​ ఎంతంటే?

IPL 2023 mi vs dc innings
IPL 2023 mi vs dc innings
author img

By

Published : Apr 11, 2023, 9:17 PM IST

Updated : Apr 11, 2023, 10:27 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా ముంబయితో జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​​ జట్టు ఇన్నింగ్స్​ ముగిసింది. ముంబయికి 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు చేసిన దిల్లీ.. 19.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. దిల్లీ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​(51) అద్భుత ప్రదర్శన చేశాడు. మనీశ్​ పాండే(26) ఫర్వాలేదనిపించారు. మనీశ్​ మినహా.. వార్నర్​ తర్వాత వచ్చిన పృథ్వీ షా(15), యశ్​ ధుల్(2), పావెల్​(4), లలిత్​ యాదవ్​(2) తక్కువ పరుగులతే వెనుదిరిగారు. అనంతరం వచ్చిన అక్షర్​ పటేల్​(54) పరుగలు చేసి.. వార్నర్​తో కలసి స్కోర్​ బోర్డ్​ను పరుగులు పెట్టించాడు. ఇక ముంబయి బౌలర్లు చెలరేగిపోయారు. పీయుశ్​ చావ్లా(3), జేసన్​(3) వికెట్లు పడగొట్టి చెలరేగిపోయారు.​ హృతిక్​(1), రీలీ మెరెడిత్(2)​ వికెట్లు​ పడగొట్టారు.

ఇదివరకే ఆడిన మూడు మ్యాచ్​ల్లో ఓడిపోయన దిల్లీ.. ముంబయితో జరుగుతున్న ఈ మ్యాచ్​లో కూడా అంతగా రాణించలేదు. అక్షర్​ పటేల్, డేవిడ్ వార్నర్​ తప్పా.. మిగతా వాళ్లందరూ పేలవ ప్రదర్శన చేశారు. ఓపెనర్​గా దిగిన డేవిడ్​ వార్నర్​ హాఫ్​ సెంచరీ పూర్తి చేశాడు. అతడి తర్వాత వచ్చి వారందరిలో మనీశ్​, పృథ్వీ షా తప్పా మిగతా వారందరూ సింగిల్​ డిజిట్​ స్కోరుకే పెవీలియన్​ చేరారు. అందులో కుల్దీప్​ యాదవ్​ డకౌట్​ అయ్యాడు.

దిల్లీ తన మొదటి మ్యాచ్​ లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో ఆడింది. ఆ మ్యాచ్​లో 50 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. రెండో మ్యాచ్​లోనైనా తేరుకుంటుంది అనుకుంటే.. గుజరాత్​ టైటాన్స్​ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ముచ్చటగా మూడో మ్యాచ్​లో దిల్లీని 57 పరుగులతో తేడాదో ఓడించింది రాజస్థాన్ రాయల్స్​ జట్టు. ​ముంబయి కూడా మొదటి మ్యాచ్​లో బెంగళూరు చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్​లోనూ ఏం మార్పు లేకుండా 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు చేతిలో ఒటమి మూటగట్టుకుంది.

దిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్​ కీపర్), పృథ్వీ షా, మనీశ్​ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ముస్తాఫిజుర్ రెహమాన్

ముంబయి ఇండియన్స్ తుదిజట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషన్ కిషన్(వికెట్​ కీపర్), కామెరూన్ గ్రీన్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జాసన్, రిలే మెరెడిత్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ.

Last Updated : Apr 11, 2023, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.