ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యకు పెద్ద షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు ఫైన్ పడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు ఈ జరిగినా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రతి మ్యాచ్‌ను 3 గంటల 20 నిమిషాల్లో ముగించాలి. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా చాలా మ్యాచ్‌లు 4 గంటలకు పైగా సాగుతున్నాయి. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం హార్దిక్ పాండ్య జట్టు మొదటి తప్పని.. అందుకే రూ. 12 లక్షలు జరిమానా విధించినట్లు ఐపీఎల్ మీడియా సలహాదారు శుక్రవారం తెలిపారు.
గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మోహిత్ శర్మ 2/18తో మెరిశాడు. ఇక యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 67 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఐపీఎల్ 16వ సీజన్లో మొత్తంగా 4 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ మూడింట్లో విజయం సాధించింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
ఈ ఐపీఎల్ సీజన్లో ఇలాంటి తప్పుకు ఫైన్ పడటం ఇదేం మొదటి సారి కాదు. ఇలాంటి తప్పుల వల్ల హార్దిక్ పాండ్య కంటే ముందు డుప్లెసిస్, సంజు శాంసన్‌కు కూడా పెనాల్టీ విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్‌కు రూ. 12 లక్షల ఫైన్ విధించారు. ఇదే కాకుండా ఏప్రిల్ 11న ఆర్సీబీ, లఖ్‌నవూ మధ్య జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ బ్యాటర్ ఆవేశ్ ఖాన్.. చివరి బంతికి పరుగు పూర్తి చేసి జట్టుకు గెలిపించినందుకు ఆనందంలో తన హెల్మెట్‌ను నేలకు కొట్టాడు. దీంతో అతడి ప్రవర్తనకు గానూ మ్యాచ్ రిఫరీ ఆవేశ్ ఖాన్‌ను మందలించాడు.
గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తాము గెలిచినప్పటికీ.. జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై హార్దిక్ పాండ్య అసంతృప్తి వ్యక్తం చేశాడు. " నిజాయతీగా చెప్పాలంటే.. నేను మా జట్టు ప్లేయర్లను ఆభినందించాలని అనుకోవట్లేదు. సులభంగా గెలిచే స్థితి నుంచి ఆఖరు బాల్ వరకు ఆడాల్సి వచ్చింది. మిడిల్ ఓవర్లలో తాము ఎక్కువ రిస్క్‌లు తీసుకోవాల్సింది. ఈ విషయంపై దృష్టి సారిస్తాం" అని హార్దిక్ అన్నాడు. అయితే, ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఎటూ తేలలేదు. ఆఖరు క్షణం వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.