ఐపీఎల్ 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. వరుసగా రెండో సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుంది. 7 వికెట్ల తేడాతో గెలుపొంది.. వరుసగా మూడు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 17.5ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 180 పరుగులు చేసింది. అలా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో ఆరింటిలో గెలిచి.. టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం మూడు మ్యాచులు గెలిచినా.. మిగిలిన జట్లతో సంబంధం లేకుండానే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. తాజా మ్యాచ్‌లో శుభమన్ గిల్(35 బంతుల్లో 49; 8x4) 1 పరుగు తేడాతో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నా.. విజయ్ శంకర్(24 బంతుల్లో 51*; 2x4, 5x6) సిక్సర్లు, బౌండరీలతో మోత మోగించి కోల్‌కతాను ఓడించాడు. హార్దిక్ పాండ్య(20 బంతుల్లో 26; 2x4, 1x6), డేవిడ్ మిల్లర్(18 బంతుల్లో32;2x4,2x6) బాగానే రాణించారు. కోల్కతౌ బౌలర్లలో సునీల్ నరైన్, హర్షిత్ రానా, యండ్రూ రసెల్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి179 పరుగుల స్కోరు చేసింది. రెహ్మానుల్లా గుర్బాజ్(81) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 15 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 19 పరుగులు చేసిన నారాయణ్ జగదీశన్.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శార్దూల్ ఠాకూర్ 4 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన రెహ్మానుల్లా గుర్బాజ్.. 81 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 20 బంతుల్లో ఓ సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసిన రింకూ సింగ్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో జోష్వా లిటిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన ఆండ్రూ రస్సెల్.. మహ్మద్ షమీ వేసిన ఆఖరి ఓవర్ లాస్ట్ బాల్‌కు ఔట్ అయ్యాడు. చివర్లో డేవిజ్ వీజ్ ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు. జోష్వా లిటిల్, నూర్ అహ్మద్ తలో రెండు దక్కించుకున్నారు. రషీద్ ఖాన్ వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇదీ చూడండి:
- IPL 2023 : రెహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు ఇన్నింగ్స్.. వెనక్కి పరిగెడుతూ మోహిత్ శర్మ డైవింగ్ క్యాచ్
- IPL 2023 KKR VS GT : అరుదైన దృశ్యం.. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్.. ఆ ముగ్గురు ఒకటే..!