IPL 2022: సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (68), దీపక్ హుడా (51) అర్ధ శతకాలతో చెలరేగిన వేళ 169/7 పరుగులు చేసింది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్. క్వింటన్ డికాక్ (1), ఎవిన్ లూయిస్ (1), మనీష్ పాండే (11) దారుణంగా విఫలమయ్యారు. దీంతో హైదరాబాద్ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది లఖ్‌నవూ. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియా షెఫార్డ్, నటరాజన్ తలో రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.
లఖ్‌నవూ.. 4.5 ఓవర్లకే 27/3 స్కోరుతో ఉన్న దశ నుంచి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు దీపక్ హుడా, రాహుల్. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దీపక్.. షెఫార్డ్ బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వేగం పెంచి ఆడిన రాహుల్.. నటరాజన్ బౌలింగ్‌లో దొరికిపోయాడు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా యువ క్రికెటర్‌పై శాస్త్రి సంచలన వ్యాఖ్యలు