IPL 2022: వరుసగా ఐదు విజయాలు సాధించి జోరు మీద కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పరాజయాల బాట పట్టింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ను ఓపెనర్లు నిరాశపరిచారు. పూరన్ (62) చేలరేగి ఆడినా ఫలితం దక్కలేదు. మిగతా బ్యాటర్లలో మార్క్రమ్ (42: 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సలు) రాణించాడు. రాహుల్ త్రిపాఠి (22) ఫర్వాలేదనిపించాడు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ 2, నోర్జే, మిచెల్ మార్ష్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (92; 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడగా.. రోమన్ పొవెల్ (67; 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. దిల్లీ మిగతా బ్యాటర్లలో రిషభ్ పంత్ (26) పరుగులు చేయగా.. మిచెల్ మార్ష్ (10), మన్దీప్ సింగ్ (0) డకౌట్ అయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: ఈ ఐపీఎల్ సీజన్లో టాప్ కెప్టెన్ ఎవరో తెలుసా?