IPL 2022 RR vs KKR: రాజస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. సంజూసేన విధించిన 153 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో నితీశ్ రాణా(48 నాటౌట్: 37 బంతుల్లో), రింకూ సింగ్(42 నాటౌట్: 23 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్(34: 32 బంతుల్లో), రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ సేన్ తలో వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సంజూ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ (54) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హిట్ మేయర్ (25*), జోస్ బట్లర్ (22), పరాగ్ (19) తప్ప మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ 2 వికెట్లు తీయగా.. శివమ్ మావి, రాయ్, ఉమేశ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇక శ్రేయస్ సేనకు 5 పరాజయాల తర్వాత ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నాలుగింట్లో గెలిచింది. కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకోవాలంటే మిగతా అన్ని మ్యాచుల్లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. సంజూసేన 10 మ్యాచుల్లో 6 విజయాలు సాధించింది.
ఇదీ చదవండి: సన్‌రైజర్స్‌కు దెబ్బమీద దెబ్బ.. ఆల్‌రౌండర్ మళ్లీ దూరం!