IPL 2022 Promo: చెన్నైసూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నటించిన ఓ ఐపీఎల్ ప్రోమోను తొలగించనున్నారు. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిన్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో ఓ రోడ్డు భద్రతా సంస్థ ఫిర్యాదు మేరకు వీడియోలో మార్పులు చేయడం లేదా తొలగించాలని ఏఎస్సీఐ పేర్కొంది.
ఈ ఐపీఎల్ ప్రోమోలో ధోనీ.. బస్ డ్రైవర్‌గా కనిపిస్తాడు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న బస్‌ను వెనక్కు తీసుకొచ్చి నడిరోడ్డులోనే ఆపేస్తాడు. 'ఏం చేస్తున్నావ్?' అని ఓ పోలీస్ ప్రశ్నించగా.. ప్రయాణికులతో కలిసి మ్యాచ్ సూపర్ ఓవర్ చూస్తున్నట్లు బదులిస్తాడు ధోనీ. ఇదంతా సాధారణమే అన్నట్లు పోలీస్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. లోతుగా దర్యాప్తు చేసిన అనంతరం.. వీడియోలో మార్పులు చేయడం లేదా తొలగించాలని ఏఎస్సీఐ పేర్కొనగా.. ఏప్రిల్ 20లోగా దానిని తొలగించేందుకు సంబంధిత వర్గాలు అంగీకరించినట్లు సమాచారం.
-
When it's the #TATAIPL, fans can go to any extent to catch the action - kyunki #YehAbNormalHai!
— IndianPremierLeague (@IPL) March 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
What are you expecting from the new season?@StarSportsIndia | @disneyplus pic.twitter.com/WPMZrbQ9sd
">When it's the #TATAIPL, fans can go to any extent to catch the action - kyunki #YehAbNormalHai!
— IndianPremierLeague (@IPL) March 4, 2022
What are you expecting from the new season?@StarSportsIndia | @disneyplus pic.twitter.com/WPMZrbQ9sdWhen it's the #TATAIPL, fans can go to any extent to catch the action - kyunki #YehAbNormalHai!
— IndianPremierLeague (@IPL) March 4, 2022
What are you expecting from the new season?@StarSportsIndia | @disneyplus pic.twitter.com/WPMZrbQ9sd
ఇవీ చూడండి:
'ధోనీ ఏదో చెప్పాడు.. వెంటనే అవుట్ అయిపోయా'
'ధోనీ నిర్ణయాలు తీసుకోవడమేంటి?'- జడేజా షాకింగ్ కామెంట్స్!
కోచ్‌కు ధోనీ స్వీట్ వార్నింగ్.. అడిగేవరకు సలహాలు ఇవ్వొద్దంటూ..