ETV Bharat / sports

ప్రజలకు 'ఆరెంజ్​ ఆర్మీ' కొవిడ్ సందేశం

దేశంలో కరోనా రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. దీనిపై అవగాహన కల్పించేందుకు ఐపీఎల్​ ఫ్రాంఛైజీ సన్​రైజర్స్​ వినూత్నంగా ప్రయత్నించింది. మహమ్మారి గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్టు చేసింది.

With eye on rising Covid-19 cases, SRH players urge people to stay at home
సన్​రైజర్స్​ హైదరాబాద్, మనీశ్ పాండే, డేవిడ్ వార్నర్
author img

By

Published : Apr 24, 2021, 5:27 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలను అప్రమత్తం చేయడానికి సన్​రైజర్స్​ హైదరాబాద్​ క్రికెటర్లు తమ వంతు సాయానికి ప్రయత్నించారు. ప్రజలందరూ కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని ఎస్​ఆర్​హెచ్​ ఆటగాళ్లు వీడియో సందేశం పంపారు. వైరస్​ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు విధిగా సహకరించాలని కోరారు.

మనీశ్​ పాండే, జానీ బెయిర్ స్టో, జేసన్ హోల్డర్, విజయ్ శంకర్​, డేవిడ్ వార్నర్, కేన్​ విలియమ్సన్​.. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ.. ఉన్న వీడియోను ఎస్​ఆర్​హెచ్​ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్​ చేసింది. ఆటగాళ్లు వారి వారి తరహాలో అభిమానులను కొవిడ్ గురించి భద్రతలు చెప్పారు.

కాగా, దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,46,786 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో వచ్చిన అత్యధిక కేసులు ఇవే. కరోనా ధాటికి మరో 2,624 మంది ప్రాణాలు విడిచారు.

ఇదీ చదవండి: 'కొవిడ్​ నుంచి కోలుకున్నా.. త్వరలోనే ప్లాస్మా దానం చేస్తా'

ఇదీ చదవండి: హైదరాబాద్ రంజీ ప్లేయర్​ అశ్విన్ యాదవ్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.