కరోనా కారణంగా మే నెలలో అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-14వ సీజన్(ipl 2021 second phase) యూఏఈ వేదికగా మళ్లీ ప్రారంభం కానుంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్(csk vs mi 2021)తో ఢీకొట్టనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) ప్రారంభం కానుండటం వల్ల ఈ టోర్నీని సద్వినియోగం చేసుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు.
కరోనా నిబంధనల మధ్య ఐపీఎల్-14వ సీజన్(ipl 2021 second phase) తిరిగి ప్రారంభమవుతోంది. ఇతర టోర్నీల షెడ్యూళ్లను మార్చిన బీసీసీఐ టీ20 ప్రపంచకప్‌నకు ముందుగానే లీగ్ నిర్వహణకు విండో ఏర్పాటు చేసింది. కరోనా కలకలంతో భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు(ind eng test) వాయిదాపడింది (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లను సురక్షితంగా యూఏఈకి చేర్చి క్రీడా పండితుల అనుమానాలను పటాపంచలు చేసింది.
ప్రేక్షకులకు అనుమతి
బయో బబూల్‌లో 2020 ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ అదే స్ఫూర్తితో 14వ సీజన్ మలిదశ మ్యాచ్‌లను విజయవంతంగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. 2019 తర్వాత తొలిసారిగా ప్రేక్షకులను మైదానాల్లోకి అనుమతిస్తున్నారు (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఐపీఎల్ 14వ సీజన్(ipl 2021 second phase)కు సంబంధించి ఇంతవరకు 29మ్యాచులు జరిగాయి. దాదాపు అన్ని జట్లు సగం మ్యాచ్‌లు ఆడాయి. పాయింట్ల పట్టికలో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. సీఎస్కే, ఆర్సీబీ, ముంబయి తర్వాతి స్థానాల్లో నిలిచాయి(ipl 2021 points table). మిగిలిన 31 మ్యాచులు యూఏఈ వేదికపై జరగనున్నాయి. ఆదివారం రాత్రి సీఎస్కే, ముంబయి పోరుతో ఐపీఎల్ మలివిడత సమరం పునఃప్రారంభం కానుంది. వచ్చేనెల 15న ఫైనల్ పోరు జరగనుంది.
పక్కా ప్రణాళికలతో..
తొలిదశలో ప్రదర్శించిన జోరు కొనసాగించాలని దిల్లీ భావిస్తోంది. గత సీజన్‌లో తేలిపోయిన సీఎస్కే ఈసారి మంచి ప్రదర్శన ఇస్తోంది. పొట్టి ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన కోహ్లీ(virat kohli captaincy news).. ఆర్సీబీకి ఈసారి కప్పు అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆర్సీబీని ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపి ఆత్మవిశ్వాసంతో టీ20 సంగ్రామానికి(t20 world cup 2021) వెళ్లాలని భావిస్తున్నాడు. తొలిదశలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని ముంబయి మునుపటి ఫామ్ అందుకోవాలని చూస్తోంది. పంజాబ్, రాజస్థాన్, కోల్‌కతా జట్ల కీలక ఆటగాళ్లు మలిదశ సీజన్‌కు దూరంకాగా వారి స్థానాల్లో తీసుకున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆయాజట్లకు కీలకం కానుంది. ఆడిన ఏడు మ్యాచ్‌లో ఒకటి మాత్రమే గెలిచిన సన్‌రైజర్స్ పోటీలో కొనసాగాలంటే ఆసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహంగా..
అలాగే ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇదే వేదికల్లో పొట్టి ప్రపంచకప్(t20 world cup 2021) జరగనున్న వేళ అక్కడి పరిస్థితులకు అలవాటుపడాలని అన్ని దేశాల ఆటగాళ్లు భావిస్తున్నారు. ఐపీఎల్ అనుభవం తమ దేశం తరఫున ఆడేటప్పుడు ఉపయోగపడుతుందని యోచిస్తున్నారు. వచ్చేనెల జరగనున్న టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 schedule) కోసం అన్నిదేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. అయితే జట్లలో మార్పులు చేసుకునేందుకు వచ్చేనెల 10 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గాయాలు లేదా ఇతర కారణాలతో ఎవరైన దూరమైతే ఐపీఎల్‌లో రాణించిన ఆటగాళ్లకు దేశం తరఫున ఆడే అవకాశం రావచ్చు.