సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. బట్లర్(124) సెంచరీ ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్(12)ను మూడో ఓవర్లోనే రషీద్‌ఖాన్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(48) అర్ధసెంచరీకి దగ్గరగా వచ్చి ఔటయ్యాడు.మొత్తంగా రెండో వికెట్‌కు ఓపెనర్ బట్లర్‌తో కలిసి కలిసి 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 124 పరుగులు చేసిన బట్లర్ దూకూడుకు 19 ఓవర్లో కళ్లెం వేశాడు సందీప్ శర్మ. దీంతో అతడు మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్(15*), డేవిడ్ మిల్లర్(7*) తమ వంతుగా ఆడారు.