ETV Bharat / sports

RCB Vs SRH: ఉత్కంఠ పోరులో సన్​రైజర్స్​దే విజయం - ఆర్సీబీ

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.  హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

IPL 2021, RCB Vs SRH
బెంగళూరు వర్సెస్​ హైదరాబాద్​
author img

By

Published : Oct 6, 2021, 11:21 PM IST

Updated : Oct 6, 2021, 11:30 PM IST

ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌ గెలుపొందింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచులో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌ (41), మాక్స్‌వెల్ (40) రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

ఛేదనకు దిగిన బెంగళూరు జట్టుకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్‌ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి డేనియల్ క్రిస్టియన్‌ (1) నిరాశ పరిచాడు. శ్రీకర్‌ భరత్‌ (12) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. జేసన్ రాయ్‌ (44), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (31) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్‌ విఫలమవ్వడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (13) జార్జ్ గార్టన్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్‌తో కలిసి జేసన్‌రాయ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కొంతసేపు నిలకడగా ఆడారు. ఈ క్రమంలో 11.2వ బంతికి విలియమ్సన్‌ ఔట్‌ అవ్వడంతో విలువైన భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ప్రియమ్ గార్గ్‌ (15), వృద్ధిమాన్ సాహా (10), జేసన్‌ హోల్డర్‌ (16) అబ్దుల్‌ సమద్‌ (1), రషీద్‌ ఖాన్‌ (7) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరారు. దీంతో హైదరాబాద్‌ జట్టు ప్రత్యర్థి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్ మూడు, డేనియల్ క్రిస్టియన్‌ రెండు, జార్జ్‌ గార్టన్‌, యుజువేంద్ర చాహల్ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి.. చేతులెత్తేసిన హైదరాబాద్​ బ్యాట్స్​మెన్​.. ఆర్సీబీ ముందు స్వల్ప లక్ష్యం

Last Updated : Oct 6, 2021, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.