ఐపీఎల్ 2021(IPL 2021 News) రెండో దశ కోసం యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నెట్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. సెకండ్ ఫేజ్ తొలి మ్యాచ్‌లో పటిష్ట ముంబయి ఇండియన్స్(mi vs csk 2021)ను చిత్తుచేసిన సీఎస్కే.. నేడు (సెప్టెంబర్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(csk vs rcb 2021)తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. ఈ సమయంలోనే నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు మహీ.
సీఎస్కే నెట్స్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు బౌలింగ్ చేశాడు ధోనీ(dhoni bowling action). మామూలుగా మీడియం పేస్ వేసే మహీ ఈసారి స్పిన్ ట్రై చేశాడు. ధోనీ బౌలింగ్(dhoni bowling action)లో మొదట వరుస బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు జడ్డూ. తర్వాత ఫ్లాట్ డెలివరీతో జడేజాను బోల్తా కొట్టించాడు మహీ. వీరిద్దరి మధ్య పోరుకు సంబంధించిన వీడియోను నెట్టింట విడుదల చేసింది ఫ్రాంచైజీ. దీనిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముంబయి(mi vs csk 2021)తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించిన చెన్నై. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి 81 పరుగుల భాగస్వామ్యం నిర్మించి ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు జడేజా. వీరిద్దరి పోరాటంతో ధోనీసేన 156 పరుగులు చేయగలిగింది. తర్వాత ముంబయిని 136 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది.
నేడు (సెప్టెంబర్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore 2021)తో తలపడనుంది ధోనీ సారథ్యంలోని సీఎస్కే. ముంబయి(mi vs csk 2021)పై విజయంతో చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉండగా.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆర్సీబీ.. ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది.