ETV Bharat / sports

ఐపీఎల్: హైదరాబాద్​ తొలి పంచ్​ ఇస్తుందా?

రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్​-కోల్​కతా జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్​ షురూ కానుంది.

Morgan-led KKR open IPL campaign against consistent SRH
ఐపీఎల్: హైదరాబాద్​ తొలి పంచ్​ ఇస్తుందా?
author img

By

Published : Apr 11, 2021, 5:30 AM IST

ఈ సీజన్​లో తొలి మ్యాచ్​ ఆడేందుకు సన్​రైజర్స్ హైదరాబాద్​ సిద్ధమైంది. చెన్నై వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో ఆదివారం(ఏప్రిల్ 11) తలపడనుంది. మరి ఇరుజట్ల బలబలాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.

వార్నర్ మాయ చేస్తాడా?

ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది హైదరాబాద్​. గతేడాది గాయంతో మధ్యలో వైదొలగిన భువనేశ్వర్​ తిరిగి జట్టులోకి రావడం, అతడికి తోడుగా యార్కర్​ స్పెషలిస్ట్ నటరాజన్, రషీద్ ఖాన్.. ప్రత్యర్థి జట్టును తమ బంతులతో ఇబ్బంది పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. బ్యాటింగ్​లో వార్నర్, బెయిర్​స్టో, విలియమ్సన్, మనీష్ పాండేతో బలంగా ఉన్నప్పటికీ మిడిలార్డర్​ సమస్య వేధిస్తోంది. దీనికి ఈ సీజన్​లోనైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.

కోల్​కతా మెరిసేనా?

గత సీజన్​ మధ్యలో జట్టు కెప్టెన్సీ అందుకున్న మోర్గాన్.. ఈసారి పూర్తిస్థాయి సారథిగా మైదానంలో దిగుతున్నాడు. తన అనుభవంతో మ్యాచ్​ల్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నాడు. శుభ్​మన్ గిల్, నితీశ్ రానా బ్యాటింగ్​పై నమ్మకమున్నప్పటికీ.. దినేశ్ కార్తిక్, రసెల్ ఎలా ఆడతారన్నదే ప్రశ్న. కొత్తగా వచ్చిన హర్భజన్ సింగ్.. స్పిన్​కు అనుకూలించే చెపాక్ పిచ్​పై ఎలా ప్రభావం చూపిస్తాడో.

IPL 2021
ఐపీఎల్ ట్రోఫీ

జట్లు(అంచనా)

హైదరాబాద్: వార్నర్(కెప్టెన్), బెయిర్​స్టో, విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, సాహా, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ.

కోల్​కతా: శుభ్​మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, షకిబ్ అల్ హాసన్, హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ, కమలేశ్ నాగర్​కోటి, ఫెర్గూసన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.