ETV Bharat / sports

IPL2021: 'అలా జరగకపోతే పానీపూరీ అమ్ముకునేవాడిని' - ipl 2021

ఒకానొక దశలో క్రికెట్​ను పూర్తిగా వదిలేయాలని భావించినట్లు తెలిపాడు కోల్​కతా నైట్​ రైడర్స్​ బ్యాట్స్​మన్​ షెల్డన్​ జాక్సన్(sheldon jackson ipl 2021)​. ఆటలో తాను రాణించలేకపోయి ఉంటే పానీపూరీ అమ్ముకునేవాడినని చెప్పాడు.

sheldon
షెల్డాన్​
author img

By

Published : Sep 16, 2021, 4:22 PM IST

క్రికెట్​లో రాణించలేకపోయి ఉంటే రోడ్లపై పానీపూరీ అమ్ముకునేవాడినని అంటున్నాడు కోల్​కతా నైట్​ రైడర్స్​ బ్యాట్స్​మన్​ షెల్డన్​ జాక్సన్​(sheldon jackson ipl 2021). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు తన కెరీర్​లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకానొక దశలో క్రికెట్​ను పూర్తిగా వదులుకోవాలని తాను భావించినట్లు చెప్పాడు.

"నా 25ఏళ్ల వయసులో క్రికెట్​ను పూర్తిగా వదిలేయాలని అనుకున్నా. రంజీ ట్రోఫీలో ఐదేళ్ల పాటు ఒక్క సింగిల్​ మ్యాచ్​ కూడా ఆడలేదు. అప్పుడు షపత్​ షా అనే నా ​స్నేహితుడు.. 'ఇన్నేళ్లు బాగా కష్టపడ్డావు. ఇంకొక ఏడాది అవకాశం కోసం ఎదురుచూడు. అప్పటికీ ఇలానే ఉంటే తిరిగి వచ్చేయ్​. నేను జాబ్​ ఇస్తా. నా ఫ్యాక్టరీలో పని చేయ్​. కానీ ఇంకొక ఏడాది మాత్రం ఎదురుచూడు' అని నన్ను ప్రోత్సహించాడు. ఆ ఏడాది రికార్డులు తిరగరాశా. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచా. ఒకే ఏడాది నాలుగు సెంచరీలు బాదాను. అందులో మూడు వరుస శతకాలు ఉన్నాయి. అప్పటి నుంచి నా కెరీర్​ పరుగులు తీసింది. అప్పుడే నిశ్చయించుకున్నా. నా జీవితంలో ఏదైనా చేయాలని. ఇంకా క్రికెట్​పై తప్ప దేనిపై దృష్టి సారించలేదు. ఒకవేళ క్రికెట్​ సెట్​ అవ్వకపోయి ఉంటే రోడ్లపై పానీపూరీ అమ్ముకునేవాడిని."

-షెల్డన్​ జాక్సన్​, కేకేఆర్​ బ్యాట్స్​మన్​.

ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో సౌరాష్ట్ర జట్టు(sheldon jackson saurashtra) తరఫున అరంగేట్రం చేసిన జాక్సన్.. దేశవాళీ క్రికెట్​లో నిలకడగా రాణిస్తున్నాడు. 5వేలకుపైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది సయ్యద్​ ముస్తక్​ అలీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్​పై జరిగిన ఓ మ్యాచ్​లో 50బంతుల్లో 106పరుగులు చేశాడు.

ఐపీఎల్(ipl second phase schedule 2021)​ రెండో దశ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19నుంచి ప్రారంభంకానుంది. కేకేఆర్​ తమ తొలి మ్యాచ్​లో సెప్టెంబరు 20న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో తలపడనుంది.

ఇదీ చూడండి: కోహ్లీ ఫామ్​పై ఆందోళన అనవసరం: కపిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.