ETV Bharat / sports

ఈసారి ఐపీఎల్​ ప్లేఆఫ్స్​లో ఆ 'నాలుగు' జట్లు?

ఐపీఎల్-14​లో సత్తా చాటేందుకు జట్లన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈసారి ప్లేఆఫ్స్​కు చేరే జట్లు ఇవేనంటూ క్రీడా విశ్లేషకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ జట్లేంటి? వాటి బలాబలాలేంటి?

IPL 2021: 4 teams that can qualify for playoffs in the season
ఐపీఎల్​ ప్లేఆఫ్స్​లో ఆ 'నాలుగు'?.. విశ్లేషకుల అంచనా
author img

By

Published : Apr 2, 2021, 6:27 PM IST

Updated : Apr 3, 2021, 6:30 AM IST

ఐపీఎల్‌ వచ్చిందంటే చాలు ప్రతి క్రికెట్‌ ప్రేమికుడికి పండగే. హోరాహోరీగా సాగే మ్యాచ్‌లు ఎక్కడా లేని ఉత్సాహాన్నిస్తాయి. నిండు వేసవిలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వినోదాన్ని పంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా అమితాదరణ పొందిన ఈ మెగా టీ20 లీగ్‌లో ప్లే ఆఫ్స్ కీలకఘట్టం. ఇందులో నెగ్గితేనే తుది సమరానికి అర్హత సాధిస్తాయి. కానీ, అన్ని జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేవు. లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. అయితే ఈ సారి ఆ అర్హతను సాధిస్తాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్న జట్ల గురించి తెలుసుకుందాం.

dhoni ipl
ధోనీ ఐపీఎల్

1.ముంబయి ఇండియన్స్‌

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. ఎందుకంటే ఈ మెగా టీ20 లీగ్‌లో ఎక్కువసార్లు(5) టైటిల్‌ కొట్టింది ముంబయే. గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన రోహిత్‌ సేన ఈ సారి కూడా ఛాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని తహతహలాడుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మే ఈ జట్టుకు ప్రధాన బలం. మ్యాచుల్లో ఒత్తిడికి గురవకుండా ప్రత్యర్థులను బోల్తా కొట్టించే వ్యూహాలను రచించి అమలు చేయడంలో రోహిత్‌ దిట్ట. ఐపీఎల్‌లో ఇతర జట్లతో పోలిస్తే ముంబయి అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. క్వింటన్‌ డికాక్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, క్రిస్‌లిన్‌లతో టాప్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్ లాంటి బిగ్‌ హిట్టర్స్‌తో మిడిలార్డర్‌ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌ విషయానికొస్తే.. జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బోల్ట్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్, రాహుల్‌ చాహర్‌, పీయూష్‌ చావ్లా వంటి బౌలర్లలతో దుర్భేద్యంగా ఉంది. కాబట్టి ఈ సారి కూడా ముంబయి ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.

mumbai indians ipl
ముంబయి ఇండియన్స్

2.చెన్నై సూపర్‌ కింగ్స్‌

2020 మినహా ఆడిన ప్రతిసారీ ప్లే ఆఫ్స్‌కు చేరడం, మూడుసార్లు ఛాంపియన్, ఎనిమిదిసార్లు రన్నరప్​.. ఈ గణాంకాలే చెబుతాయి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎంత బలమైందో. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13 సీజన్‌కు సురేశ్ రైనా, హర్భజన్‌ సింగ్‌లాంటి ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో దూరమవడం వల్ల ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా టైటిల్‌ కొట్టి మునుపటి జోరునందుకోవాలని భావిస్తోంది ధోనీ సేన. టాప్‌ ఆర్డర్‌లో సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, రాబిన్‌ ఊతప్ప లాంటి మంచి ఆటగాళ్లున్నారు. ఈ జట్టులో ఆల్‌రౌండర్లకు కొదవలేదు. రవీంద్ర జడేజా, బ్రావో, మొయిన్‌ అలీ, మిచెల్‌ శాంటనర్‌, సామ్‌ కరన్‌ వంటి స్టార్లతో నిండుగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఇమ్రాన్‌ తాహిర్‌, కర్ణ్‌ శర్మ, కృష్ణప్ప గౌతమ్‌ కీలకం కానున్నారు. సమష్టిగా రాణిస్తే చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని భావిస్తున్నారు.

chennai super kings ipl
చెన్నై సూపర్ కింగ్స్

3. దిల్లీ క్యాపిటల్స్‌

గతేడాది అంచనాలకు మించి రాణించి మొదటిసారిగా ఫైనల్‌ చేరింది దిల్లీ క్యాపిటల్స్‌. యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించి వరుస అవకాశలిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాడు కోచ్‌ రికీ పాటింగ్‌. రిషభ్‌ పంత్‌, శిఖర్ ధావన్‌, అజింక్య రహానె, స్టీవ్‌ స్మిత్‌ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. రబాడ, నోర్జ్‌, వోక్స్, ఇషాంత్ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌, అమిత్‌ మిశ్రా, అక్షర్‌ పటేల్‌ వంటి అనుభవజ్ఞులతో బౌలింగ్‌ విభాగం దుర్భేద్యంగా ఉంది. ఇంతమంది నాణ్యమైన ఆటగాళ్లున్న దిల్లీ క్యాపిటల్స్‌ ఈ సారి ప్లేఆఫ్స్‌కు చేరడం కష్టమేమీ కాకపోవచ్చు. ఈసారి టోర్నీకి శ్రేయస్ అయ్యర్​ దూరం కావడం ఆ జట్టుకు లోటనే చెప్పచ్చు.

delhi capitals
దిల్లీ క్యాపిటల్స్

4.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

తక్కువ స్కోరు చేసినా దాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థి జట్లను అంతకన్నా తక్కువ స్కోరుకే పరిమితం చేసి విజయాలు సాధించడం ఆరెంజ్‌ ఆర్మీ ప్రత్యేకత. జట్టు విషయానికొస్తే.. కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌, మనీశ్ పాండే, కేన్‌ విలియమ్సన్‌, బెయిర్‌ స్టో, జేసన్​ రాయ్​, వృద్ధిమాన్‌ సాహా వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. రషీద్‌ఖాన్‌, మహమ్మద్‌ నబీ, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, సిద్దార్థ్‌ కౌల్‌లతో బౌలింగ్‌ విభాగం మెరుగ్గా ఉంది. అన్ని విభాగాల్లో రాణిస్తే సన్‌రైజర్స్ ఈ సారి ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.

sunrisers hyderabad
సన్​రైజర్స్ హైదరాబాద్

ఇవీ చదవండి:

Last Updated : Apr 3, 2021, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.