ETV Bharat / sports

ఐపీఎల్​పై మోర్గాన్​ అలా.. జంపా ఇలా! - కేన్ రిచర్డ్సన్ స్థానంలో స్కాట్ కుగెలిన్

భారత్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్​లో పాల్గొన్న క్రికెటర్లు ఈ మెగాలీగ్ నిర్వహణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.​ ఈ లీగ్​ను అంతకుముందులానే దుబాయ్​లో నిర్వహించాల్సిందని ఐపీఎల్​ను వీడిన ఆడమ్​ జంపా అభిప్రాయపడ్డాడు. కాగా, వైరస్​ కేసులు పెరుగుతున్నప్పటికీ ఈ మెగాలీగ్​ను కొనసాగించవచ్చని అన్నాడు కోల్​కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్​.

IPL
ఐపీఎల్
author img

By

Published : Apr 28, 2021, 8:45 AM IST

ఐపీఎల్​ను నిరుటిలాగే యూఏఈలో నిర్వహించాల్సిందని లీగ్​ను వీడిన ఆడమ్ జంపా అన్నాడు. "ఈసారి బబుల్ కారణంగా హాని తప్పదన్న భయం కలిగింది. ఆరు నెలల కిందట దుబాయ్​లో అలా అనిపించలేదు. ఈసారీ లీగ్​ను అక్కడే నిర్వహించాల్సింది. నేను ఐపీఎల్​ను వీడడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. నాకు తుది జట్టులో ఆడే అవకాశం కూడా రావడం లేదు. బబుల్లో విసిగిపోయాను. భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన రాగానే లీగ్​ను వీడేందుకు ఇదే సరైన సమయం అనిపించింది" అని ఆడమ్​ వివరించాడు.

ఐపీఎల్​ కొనసాగించవచ్చు..

భారతదేశంలో కరోనా తీవ్రమవుతున్నందుకు బాధగా ఉందని ఇంగ్లాండ్, కోల్​కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్​ అన్నాడు. అయితే వివిధ రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్​డౌన్​లు విధిస్తున్నా ఐపీఎల్​ కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డాడు.

"నిరుడు బ్రిటన్​లో చాలా రోజులు లాక్​డౌన్ ఉంది. ఇప్పట్లో క్రికెట్ సాధ్యం కాదనే అనుకున్నాం. లాక్​డౌన్ తర్వాత టీవీలో మొదట చూసింది న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా మ్యాచే. అది రగ్బీ మ్యాచ్​. ఆ తర్వాత నెమ్మదిగా బుండెస్​లిగా మొదలైంది. ఆ తర్వాత ప్రీమియర్ లీగ్ ఆరంభమైంది. దేశమంతా ఉన్నా ఆటలు ఆడొచ్చని ఆ లీగ్​లు చూపించాయి. అవే ఇప్పుడు నమూనాలు. వాటిని అనుసరించవచ్చు" అని మోర్గాన్​ అన్నాడు.

కేన్ రిచర్డ్​సన్ స్థానంలో స్కాట్ కుగెలిన్

కొవిడ్ భయంతో స్వదేశానికి తిరిగెళ్లిన ఆస్ట్రేలియా ఆటగాడు కేన్ రిచర్డ్​సన్​ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. న్యూజిలాండ్ పేసర్ స్కాట్ కుగెలిన్​ను జట్టులోకి తీసుకుంది. కుగెలిన్ ఇప్పటికే ముంబయి జట్టు రిజర్వ్ ఆటగాడిగా బయోబబుల్లో ఉన్నాడు. 29 ఏళ్ల అతడు కివీస్ తరఫున రెండు వన్డేలు, 16 టీ20 మ్యాచ్​లు ఆడాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.