ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ.. జట్టుపై తనకున్న ప్రేమ, విధేయత గురించి చెప్పాడు. ఆర్సీబీని విడిచిపెట్టాడం, వేరే జట్టుకు ఆడటం లాంటి ఆలోచలనే తనకు లేవని అన్నాడు. ఈ విషయాన్నే చెబుతూ బెంగళురు జట్టు, కోహ్లీ ఫొటోతో ట్వీట్ చేసింది.
-
"I don't see myself leaving or playing for any other IPL team"
— Royal Challengers Bangalore (@RCBTweets) April 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Home is where the heart is! ❤️#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/hCyyZxYQ9M
">"I don't see myself leaving or playing for any other IPL team"
— Royal Challengers Bangalore (@RCBTweets) April 7, 2021
Home is where the heart is! ❤️#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/hCyyZxYQ9M"I don't see myself leaving or playing for any other IPL team"
— Royal Challengers Bangalore (@RCBTweets) April 7, 2021
Home is where the heart is! ❤️#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/hCyyZxYQ9M
2008లో కుర్రాడిగా ఆర్సీబీలోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ద్రవిడ్, కుంబ్లే, వెటోరి కెప్టెన్సీలో ఆడాడు. 2013లో సారథిగా బాధ్యతలుగా అందుకున్న తర్వాత నుంచి ఇప్పటికీ జట్టును నడిపిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్‌కు చేరిన బెంగళూరు.. ఒక్కసారైనా కప్పు కొట్టలేకపోయింది. ప్రస్తుత సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.
ఐపీఎల్లో 192 మ్యాచ్‌లాడిన కోహ్లీ.. 5878 పరుగులతో మిగతా బ్యాట్స్‌మెన్ కంటే టాప్‌లో ఉన్నాడు. ఇందులో 5 సెంచరీలు, 39 అర్ధసెంచరీలు ఉన్నాయి.
ఇవీ చదవండి: