ETV Bharat / sports

'కెప్టెన్​గా తప్పించినా వార్నర్​కు అదే ఆలోచన'

ఐపీఎల్​ కెప్టెన్​గా వార్నర్​ను తప్పించినా సరే జట్టు కోసమే ఆలోచించాడని సన్​రైజర్స్​ సహాయ కోచ్​ బ్రాడ్​ హాడిన్ అన్నాడు​. క్లిష్ట పరిస్థితుల్లో అతడు వ్యవహరించిన తీరు అద్భుతమని అన్నాడు.

warner
వార్నర్​
author img

By

Published : May 13, 2021, 5:11 PM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​ మాజీ కెప్టెన్ వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తొలిగించినా ఏ మాత్రం సహనం కోల్పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని ఆ జట్టు సహాయ​ కోచ్​ బ్రాడ్​ హాడిన్ చెప్పాడు​. తనపై వేటు పడినా, జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడని చెప్పాడు.

"వార్నర్​ను తొలగించడం వల్ల ప్రతిఒక్కరూ షాక్​ అయ్యారు. కానీ అతడు మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించాడు. వరుస ఓటముల నేపథ్యంలో జట్టులో మార్పులు చేయాలని మేనేజ్​మెంట్​ భావించింది. ప్రమాణాలకు తగ్గట్టుగా ఆడటం లేదని కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే అతడి కెప్టెన్సీ నుంచి తప్పించారు. వార్నర్​ దాన్ని చాలా సున్నితంగా తీసుకున్నాడు. త్వరలోనే మళ్లీ బరిలోకి దిగుతాడని భావిస్తున్నాను. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లరో తాను ఒకడు. బెంచ్​ మీద కూర్చోవాల్సి వచ్చినా బాధపడకుండా ప్రతిఒక్కరికీ సలహాలు ఇచ్చాడు. డ్రింక్స్​ మోసుకుంటూ పరుగులు తీశాడు. ఇప్పటికీ జట్టు సమావేశాల్లోనూ తనవంతుగా పాల్గొంటూ మాట్లాడుతున్నాడు. క్లిష్ట పరిస్థితులను అతడు వ్యవహరించిన తీరు అద్భుతం" అంటూ వార్నర్​పై ప్రశంసలు కురిపించాడు.

నిరవధిక వాయిదా పడిన ఈ ఐపీఎల్​లో ఆడిన ఏడు మ్యాచ్​ల్లో ఆరింటిలో ఓడిపోయింది సన్​రైజర్స్​. వరుస పరాజయాల నేపథ్యంలో వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ టీమ్​ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కనీసం తుది జట్టులోనూ చోటు ఇవ్వలేదు. కేన్​ విలియమ్సన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

ఇదీ చూడండి: సన్​రైజర్స్ కెప్టెన్​గా​ విలియమ్సన్.. వార్నర్​కు ఉద్వాసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.