ETV Bharat / sports

CSK Vs KKR: రానా, రాహుల్ ధనాధన్.. చెన్నై లక్ష్యం 172

చెన్నై సూపర్​కింగ్స్​కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కోల్​కతా నైట్​రైడర్స్ (CSK Vs KKR). ఈ మ్యాచ్​లో గెలిస్తే చెన్నై.. మళ్లీ అగ్రస్థానానికి వెళ్తుంది.

CSK Vs KKR
చెన్నై సూపర్ కింగ్స్
author img

By

Published : Sep 26, 2021, 5:24 PM IST

చెన్నై బౌలర్లు ఆకట్టుకున్నారు. కోల్​కతా బ్యాట్స్​మెన్​లో (CSK Vs KKR) నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి మెప్పించారు. దీంతో అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో (CSK Vs KKR Live Score 2021) తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి కేకేఆర్ 171/6 చేసింది. రాహుల్ త్రిపాఠి అత్యధికంగా 45 పరుగులు చేశాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్​కతా నైట్​రైడర్స్​కు (IPL 2021 Live News) ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ శుభ్​మన్ గిల్.. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. ముందు మ్యాచ్​ల్లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్.. ఈ పోరులో 18 పరుగులే చేసి ఔటయ్యాడు. మూడోస్థానంలో దిగిన రాహుల్ త్రిపాఠి చెన్నై బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్​కు చేరాడు.
మిగతా బ్యాట్స్​మెన్​లో (Kolkata Knight Riders) రసెల్ 20, మోర్గాన్ 8, దినేశ్ కార్తిక్ 26, నితీశ్ రానా 37 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో శార్దుల్, హేజిల్​వుడ్ 2 వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.

ఇదీ చూడండి: IPL 2021: బెంగళూరు-ముంబయి.. గెలుపుబాట పట్టేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.