ETV Bharat / sports

CSK VS DC: చెలరేగిన పంత్​- షా.. చెన్నై లక్ష్యం 173 - csk vs dc

ఐపీఎల్-2021 తొలి క్వాలిఫైయర్స్​లో సీఎస్​కేకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది దిల్లీ క్యాపిటల్స్​. నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది దిల్లీ.

csk vs dc
దిల్లీ
author img

By

Published : Oct 10, 2021, 9:15 PM IST

దుబాయ్​ వేదికగా సీఎస్​కేతో జరుగుతున్న ఐపీఎల్​-2021 తొలి క్వాలిఫైయర్స్​లో.. నిర్ణీత 20ఓవర్లలో దిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లు కోల్పోయి 172పరుగులు చేసింది. ఓపెనర్​ షా(60), పంత్​ (51*), హెట్​మయర్(37)​ రాణించారు. చెన్నై బౌలర్లలో హేజిల్​వుడ్​ 2, జడేజా 1, మోయిన్​ అలీ 1, బ్రావో 1 వికెట్​ తిశారు.

CSK VS DC
రాణించిన షా

పృథ్వీ షా దూకుడు...

కీలకమైన మ్యాచ్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీకి శుభారంభం దక్కలేదు. ఓవైపు పృథ్వీ షా(60, 34బంతుల్లో) వేగంగా ఆడుతున్నా.. మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. 7 బంతుల్లో 7 పరగులు చేసి హేజిల్​వుడ్​ బౌలింగ్​లో కీపర్​ ధోనికి చిక్కాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్​ అయ్యర్​ కూడా ఆకట్టుకోలేకపోయాడు. క్రీజులో చాలా ఇబ్బంది పడ్డాడు. 8బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి హేజిల్​వుడ్​ బౌలింగ్​లో ఓ చెత్త షాట్​కు ఔట్​ అయ్యాడు.

ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన అక్షర్​ పటేల్(10)​.. షాకు కొంతసేపు స్టాండ్​ ఇచ్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. షా మాత్రం తన దూకుడుతో ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ సీఎస్​కే బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. అక్షర్​ పటేల్​ ఔట్​ అయినా దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. జోరు మీద ఉన్న షా.. సెంచరీవైపు అడుగులు వేశాడు. ప్రమాదకరంగా మారుతున్న సమయంలో రవీంద్ర జడేజా​ అతడిని ఔట్​ చేశాడు.

CSK VS DC
షా.. క్లాసిక్​ షాట్​

పంత్​- హెట్​మయర్​ కీలక ఇన్నింగ్స్​..

షా ఔట్​ అయ్యేసరికి దిల్లీ క్యాపిటల్స్​ స్కోరు 80/4. అప్పటికి 10.2 ఓవర్లే ముగిశాయి. మంచి స్కోరే ఉన్నా.. ఎక్కువ వికెట్లు పడటం వల్ల దిల్లీ అభిమానుల్లో కొంత ఆందోళన నెలకోంది.

అప్పుడే క్రీజులోకి పంత్​, హెట్​మయర్​ వచ్చారు. తొలుత ఇద్దరు తడబడ్డారు. కానీ క్రీజులో నిలదొక్కుకున్న అనంతరం ఇద్దరు ధాటికా ఆడటం మొదలుపెట్టారు. 16ఓవర్లకు స్కోరు 128/4కు చేరింది. ఆ తర్వాత ఇద్దరు ఆగలేదు. చెన్నై బౌలర్లపై దూకుడు ప్రదర్శించారు. మైదానం అన్నివైపులా ఇద్దరు ఫోర్లు బాదేసారు. ఈ క్రమంలోనే 19వ ఓవర్లో భారీ షాట్​కు ప్రయత్నించి బ్రావో బౌలింగ్​లో ఔటయ్యాడు హెట్​మయర్​. హెట్​మయర్​- పంత్​ జోడి 83 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

csk-vs-dc-delhi-scores-in-first-qualifiers
పంత్​-హెట్​మయర్​ కీలక భాగస్వామ్యం

తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్​ కరెన్(0*)​తో కలిసి జట్టు స్కోరును 170 దాటించాడు పంత్​.

పంత్​ 6..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.