ETV Bharat / sports

సీఎస్కే టీమ్​ మెంబర్​ అంత పనిచేశాడా? - ఐపీఎల్​

ఓ వ్యక్తికి సంబంధిచిన ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్​ను పొరపాటును చెన్నై సూపర్​కింగ్స్​ సభ్యుడు తీసుకెళ్లాడు. తర్వాత అది తమది కాదని గుర్తించిన ఫ్రాంఛైజీ తిరిగి అతడికి చేరవేసింది. ఈ సంఘటన అంతా దిల్లీ విమానాశ్రయంలో జరిగింది.

CSK Team Member Accidentally Picks up Oxygen Concentrator
సీఎస్కే టీమ్​
author img

By

Published : Apr 30, 2021, 7:17 AM IST

తన తండ్రి వైద్యం కోసం ఓ వ్యక్తి కొనుకున్న ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను పొరపాటున చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యుడు పట్టుకుపోయాడు. 36 గంటల తర్వాత అది తిరిగి సొంతదారుడికి చేరింది. ఈ సంఘటన దిల్లీలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏమైందంటే.. తన తండ్రిలో ప్రాణ వాయువు స్థాయి తక్కువగా ఉండటం వల్ల అన్వర్‌ బెంగళూరులో కాన్సన్‌ట్రేటర్‌ను కొన్నాడు.

ఈనెల 26న తనతో పాటు ఇండిగో విమానంలో దిల్లీకి తీసుకొచ్చాడు. అయితే బ్యాగేజీ బెల్టు దగ్గర కాన్సన్‌ట్రేటర్‌ ఉన్న కార్టన్‌ కనిపించకపోవడం వల్ల అన్వర్‌ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే సమయంలో దిల్లీలో అడుగుపెట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యుడు అన్వర్‌ రావడానికి ముందే.. అతడి కాన్సన్‌ట్రేటర్‌ ఉన్న కార్టన్‌ను పట్టుకుపోయాడు.

కరోనా తీవ్రత దృష్ట్యా ఆటగాళ్లు ఛార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారు తమ వ్యక్తిగత వస్తువుల్ని మాత్రమే వెంట తీసుకెళ్లొచ్చు. మిగతా లగేజీని విడిగా రవాణా చేస్తున్నారు. వాటిని చేరేవేసే బాధ్యత ఫ్రాంఛైజీది. ఆటగాళ్ల లగేజీ హోటల్‌లో ఒకరోజంతా శానిటైజ్‌ చేస్తారు. ఆ తర్వాతే ఆటగాళ్లు తీసుకోవచ్చు. ఈనెల 27న రాత్రి సీఎస్కే.. తమ సభ్యుడు అదనపు కార్టన్‌ను తీసుకొచ్చినట్లు గుర్తించి అధికారులకు సమాచారం అందించింది. ఆ కార్టన్‌ అన్వర్‌దేనని నిర్ధారించుకున్న అధికారులు అతనికి అప్పగించారు. సుమారు 36 గంటల తర్వాత అన్వర్‌కు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ లభించింది.

ఇదీ చూడండి.. కరోనా బాధితుల కోసం సచిన్ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.