దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH vs DC 2021) మధ్య బుధవారం(సెప్టెంబరు 22) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కొన్ని రికార్డులు ఇరు జట్లలోని పలువురు ఆటగాళ్లను ఉవ్విళూరుస్తున్నాయి. ఇంతకీ అవి ఏంటంటే..
ఈ పోరులో దిల్లీ బ్యాట్స్‌మన్ అజింక్య రహానె(Rahane IPL 2021), బౌలర్ అమిత్ మిశ్రా(Amit Mishra IPL Wickets), వృద్ధిమాన్ సాహా(సన్‌రైజర్స్) ఓ మైలురాయిని అందుకునే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌తో మిశ్రా.. దిల్లీ క్యాపిటల్స్ తరఫున వంద మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా నిలవనున్నాడు. ఇప్పటివరకు 166 వికెట్లు తీసిన అతడు.. మరో ఐదు వికెట్లు దక్కించుకుంటే లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగానూ నిలుస్తాడు. ప్రస్తుతం శ్రీలంక మాజీ ప్లేయర్ లసిత్ మలింగ(170) తొలి స్థానంలో ఉన్నాడు.
రహానె మరో 59 పరుగులు చేస్తే 4 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరుతాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్,బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha IPL) మరో 13 రన్స్ చేస్తే 2 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
ఇదీ చదవండి:
IPL 2021: సన్‌రైజర్స్ ఆటగాడికి కరోనా.. మ్యాచ్ మాత్రం యథావిధిగా