వచ్చే ఏడాది ఐపీఎల్(ipl 2022) సీజన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను(ipl new team) ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అహ్మదాబాద్, లఖ్‌నవూ జట్లు వచ్చే సీజన్లో పోటీపడబోతున్నాయని అధికారికంగా వెల్లడించింది. దీంతో ఐపీఎల్-2022లో(ipl new team 2022) మొత్తం 10 జట్లు టైటిల్ పోరులో నిలబడనున్నాయి.
అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ సొంతం చేసుకోగా..లఖ్‌నవూను ఫ్రాంచైజీని.. రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ దక్కించుకుంది. అయితే ఒక ఫ్రాంచైజీకి ఎప్పుడు లేనంత ధరకు ఆర్పీఎస్టీ బిడ్ వేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. తమ లెక్కలు తమకు ఉన్నాయన్నాని లఖ్‌నవూ ఫ్రాంచైజీ(ipl new team price) యజమాని సంజీవ్ గోయంకా(ipl new team owner) చెప్పారు.
"ఇది చాలా సింపుల్. బీసీసీఐకి మేం చెల్లించిన మొత్తం నుంచి బీసీసీఐ నుంచి మేం పొందిన మొత్తం తీసేస్తే సరిపోతుంది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. 10ఏళ్లలో మొత్తం రూ.7,000 కోట్లగాను రూ.3,500 కోట్లు మేం చెల్లిస్తాం. ఎందుకంటే.. ప్రసార హక్కుల కింద బీసీసీఐ నుంచి 3,500 కోట్లు తిరిగి పొందుతాం. రానున్న ఐదేళ్లలో మరింత ఎక్కువ మొత్తం పొందవచ్చు. ఫ్రాంచైజీ కోసం బీసీసీఐ నిర్ణయించిన కనీస బిడ్ రూ.2,100 కోట్లు. అంటే ఐపీఎల్ జట్టును ఆ కనీస ధరకే సొంతం చేసుకున్నట్లు. ఇప్పుడు చెప్పండి అది మంచిదా? కాదా?" అని ఓ క్రీడా వెబ్సైట్ నిర్వహకులతో జరిగిన ముఖాముఖిలో పేర్కొన్నారు. ఈ లెక్కలతోనే లఖ్‌నవూ ఫ్రాంచైజీని సంజీవ్ దక్కించుకున్నట్లు వెల్లడించారు.
గతంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (ఆర్పీఎస్) ఫ్రాంచైజీని యజమానిగా ఉన్నారు సంజీవ్ గోయంకా. ఐపీఎల్ 2017 సీజన్లో ఫైనల్స్‌కు చేరిన ఆ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.
ఇవీ చూడండి:
IPL New Team: ఐపీఎల్లో కొత్త జట్లు.. ఫార్మాట్లో మార్పులివే?