ETV Bharat / sports

ఐపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం- కొత్త ఆక్షనీర్‌ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్‌? - ఐపీఎల్ 2024 మల్లికా సాగర్

IPL 2024 Mini Auction : దుబాయ్‌ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ సారి మినీ వేలాన్ని మహిళా ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించనున్నారు. ఎవరామె?

IPL 2024 Mini Auction
IPL 2024 Mini Auction
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 12:39 PM IST

IPL 2024 Mini Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ 2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. దుబాయ్‌ వేదికగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలం మంగళవారం(డిసెంబర్‌ 19) జరగనుంది. ఈ మినీ వేలంలో భారత్‌ సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. అయితే ఉన్న ఖాళీలు 77 మాత్రమే. ఈ నేపథ్యంలో వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి.

అయితే ఈసారి మినీ వేలాన్ని మల్లికా సాగర్‌ అడ్వాణీ అనే మహిళ నిర్వహించనున్నారు. గత కొన్ని ఐపీఎల్‌ సీజన్లకు అక్షనర్‌ వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్థానాన్ని మల్లిక భర్తీ చేయనున్నారు. దీంతో ఐపీఎల్​లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనీర్‌గా మల్లికా సాగర్ నిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ మల్లికా సాగర్‌?
Mallika Sagar Ipl Auction : మల్లికా సాగర్​(48) మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ ఆర్ట్​ కలెకర్టర్. మోడ్రన్​ అండ్ కాన్​టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబయి ఆధారిత సంస్థకు ఆర్ట్​ కలెక్టర్ కన్సల్టెంట్​గా వ్యవహరిస్తున్నారు. అయితే వేలం నిర్వహించడంలో మల్లికకు మంచి అనుభవం ఉంది. ఆమె గత 20 ఏళ్లగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. 2001లో క్రిస్టీస్‌ ఆక్షన్‌ హౌస్‌లో వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్‌ మొదలుపెట్టారు.

అంతే కాకుండా క్రిస్టీస్‌లో వేలం నిర్వహించిన భారత సంతతికి తొలి మహిళ ఆక్షనీర్‌గా మల్లిక నిలిచారు. క్రీడా వేలంలో కూడా ఆమెకు అనుభవం ఉంది. 2021లో ప్రో కబడ్డీ లీగ్‌ వేలంలో తన వాక్చాతుర్యంతో మల్లిక అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి, రెండు సీజన్‌లకు సంబంధించిన వేలాన్ని కూడా మల్లికానే నిర్వహించారు. ఇప్పుడు మరోసారి వేలాన్ని దిగ్విజయంగా ముగించేందుకు మల్లికా సిద్దమయ్యారు.

అయితే ఐపీఎల్ యాజమాన్యం 1166 మందితో కూడిన లిస్ట్​ను ఫ్రాంఛైజీలకు ఇప్పటికే అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా తుది జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 మంది నుంచి గరిష్ఠంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయొచ్చు.

వరల్డ్​కప్​లో టాప్​ - ఐపీఎల్​లో ఎంట్రీ- మినీ వేలంలో భారీ ధర పలకనున్న స్టార్స్ వీరే!

ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తున్న ఇండియన్ క్రికెటర్లు వీళ్లే!

2024 ఐపీఎల్ వేలంలో ఫారిన్ ప్లేయర్లు- అందరి కళ్లు వీరిపైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.