ETV Bharat / sports

IPL ఆడకున్నా.. పంత్‌ను పక్కనే కూర్చోబెట్టుకుంటా!: పాంటింగ్

author img

By

Published : Jan 20, 2023, 5:21 PM IST

టీమ్​ఇండియా స్టార్​ వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దిల్లీ క్యాపిటల్స్​ హెడ్​ కోచ్​ రికీ పాంటింగ్​. తమ జట్టు కెప్టెన్ అయిన పంత్ స్థానాన్ని భర్తీ చేయగల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం వెతుకుతున్నామని తెలిపాడు. అతడు ఐపీఎల్​ 2023 సీజన్​లో ఆడకున్నా డగౌట్‌లో పక్కనే కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేస్తానని వెల్లడించాడు.

panth ponting
panth ponting

ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్​ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఐపీఎల్ 2023 సీజన్ ఆడటం లేదని దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. దిల్లీ కెప్టెన్ అయిన రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేయగల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం వెతుకుతున్నామని తెలిపాడు. తాజాగా ఐసీసీ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్.. రిషభ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌కు రోడ్డు ప్రమాదానికి గురవ్వడం బాధకరమైన విషయమని చెప్పిన పాంటింగ్.. అతడు అప్‌కమింగ్ సీజన్ ఆడకున్నా డగౌట్‌లో పక్కనే కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేస్తానని వెల్లడించాడు.

"రిషబ్ పంత్ చాలా మొండివాడు. అతడిలో నాకు బాగా నచ్చేది కూడా ఇదే. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని అతడికి ఫోన్‌లో చెప్పాను. అతడు మాత్రం ఈ టైమ్‌లో కూడా జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు. పంత్ కారు ప్రమాదం గురించి తెలియగానే చాలా భయమేసింది. యాక్సిడెంట్‌కు గురైన కారు స్థితిని చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టాయి. రిషభ్ పంత్ చాలా మంచి కుర్రాడు. అతని గురించి తెలిసిన ఎవరైనా, రిషభ్ పంత్‌‌ను ప్రేమిస్తారు, ఇష్టపడతారు. రిషభ్ పంత్‌లో ఓ అందమైన ప్రపంచం ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. రిషభ్ పంత్ వీలైనంత తొందరగా క్రీజులోకి తిరిగి రావాలని నేను దేవుడిని కోరుకుంటున్నా. రిషబ్ పంత్‌ ప్లేస్‌ని రిప్లేస్ చేయడం చాలా కష్టం."

-- రికీ పాంటింగ్​, దిల్లీ క్యాపిటల్స్​ హెడ్​ కోచ్​

"రిషభ్ పంత్ వంటి ప్లేయర్లను చెట్టు మీద నుంచి కాయ తెంపినంత ఈజీగా తీసుకురాలేం. అయితే ఇప్పుడు టీమ్‌లో ఉన్న వికెట్ కీపింగ్ బ్యాటర్లే మాకు దిక్కు. వారిలో ఎవరి సత్తాను బట్టి, వారికి అవకాశాలు వస్తాయి. ఓ కోచ్‌గా డగౌట్‌లో పంత్ నా పక్కనే ఉండాలనుకుంటా. ఫిట్‌గా లేకున్నా.. ఆడకున్నా అతడు మా పక్కనే ఉండటాన్ని ఇష్టపడుతాం. ఓ కెప్టెన్‌గా, ఆటగాడిగా అతను ఎంతో సరదాగా ఉంటాడు. ఆటగాళ్లలో స్పూర్తిని నింపుతాడు. తన మాటలతో నవ్వులు పూయిస్తాడు. అతడు ప్రయాణించగలిగితే ఐపీఎల్ జరిగినన్ని రోజులు మా డగౌట్‌లో పక్కనే కూర్చోబెట్టుకుంటాం. మార్చి మధ్యలో దిల్లీలో కలవాలని అనుకుంటున్నాం. అప్పటికి అతడు పూర్తిగా కోలుకుంటాడనే అనుకుంటున్నా" అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

గతేడాది డిసెంబర్ 30న రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌కు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం దెహ్రాదూన్​లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత శస్త్రచికిత్స అవసరం ఉండటంతో ముంబయిలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే అతడికి పలు ఆపరేషన్లు జరిగాయి. ముఖ్యంగా అతడి మోకాళ్లకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.