IPL 2022 RR Team Captain: ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభంకావడానికి మరో పది రోజులే ఉంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథిగా సంజూ శాంసన్‌ను తప్పించి టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను నూతన కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది ఫ్రాంఛైజీ. అయితే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్! ఈ కెప్టెన్సీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కాదు. అల్లరి చేష్టలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యుజ్వేంద్ర్ చాహల్.
అసలు ఏం జరిగిందంటే?
రాజస్థాన్ రాయల్స్ జట్టు అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను యుజ్వేంద్ర చాహల్ హ్యాక్ చేశాడు. ఇక నుంచి తానే జట్టుకు కొత్త కెప్టెన్ అని ప్రకటించుకున్నాడు. హ్యాక్ చేసిన విషయాన్ని కూడా చాహాల్ తన ట్విట్టర్ వేదికగా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా తాను బ్యాటింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. 10వేల రీట్వీట్స్ వస్తే జోస్ బట్లర్ అంకుల్‌తో కలిసి ఓపెన్ చేస్తానని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక చాహాల్ ట్వీట్‌కు రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ సరదాగా కంగ్రాట్స్ తెలిపాడు.
చాహల్ చేసిన ఈ ట్వీట్‌ను చూసి అభిమానులు షాక్ అయ్యారు. కానీ కొందరు మాత్రం ఇది చాహల్ పనే అయ్యుంటుందని గ్రహించారు. కాగా, రాజస్థాన్ రాయల్స్ అధికారిక ట్విట్టర్‌ను హ్యాండిల్ చేసే వ్యక్తి నుంచి పాస్వర్డ్ తీసుకున్న చాహల్.. ఈ పని చేశాడు. అంతటితో ఆగకుండా తన ట్విటర్ వేదికగా పాస్వర్డ్ ఇచ్చిన వ్యక్తికి ధన్యవాదాలు కూడా తెలిపాడు. జట్టు యాజమాన్యానికి తెలిసే ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
-
Meet RR new captain @yuzi_chahal 🎉 🎉 pic.twitter.com/ygpXQnK9Cv
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Meet RR new captain @yuzi_chahal 🎉 🎉 pic.twitter.com/ygpXQnK9Cv
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022Meet RR new captain @yuzi_chahal 🎉 🎉 pic.twitter.com/ygpXQnK9Cv
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
చాహాల్ గత సీజన్ వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని రూ.6.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇప్పటికే ముంబై చేరిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది.
-
10000 Retweets and He will open with @josbuttler uncle 🤣😍 pic.twitter.com/2gjr1GxdWK
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">10000 Retweets and He will open with @josbuttler uncle 🤣😍 pic.twitter.com/2gjr1GxdWK
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 202210000 Retweets and He will open with @josbuttler uncle 🤣😍 pic.twitter.com/2gjr1GxdWK
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
ఇదీ చదవండి: కోహ్లీ కన్నా రోహిత్ గొప్ప కెప్టెన్.. ఎందుకంటే?