IPL 2022: బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలిపోరులో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో ఈ మెగా టోర్నీ మొత్తంలో అత్యధికంగా నాలుగు సార్లు 200 పై చిలుకు స్కోర్లను ఛేదించిన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యంకాని గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ జాబితాలో చెన్నై మూడుసార్లు 200కు పైగా లక్ష్యాలను ఛేదించి రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు బెంగళూరు నాలుగు సార్లు ఈ టోర్నీలో 200పై చిలుకు లక్ష్యాలను కాపాడుకోలేకపోయి అనవసరపు రికార్డును సొంతం చేసుకుంది. అలాగే ఇదే మ్యాచ్‌లో 21 వైడ్లు వేయడం ద్వారా.. టోర్నీ మొత్తంలోఒక్క మ్యాచ్‌లో అత్యధిక వైడ్లు వేసిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. గతంలో పంజాబ్ 2011లో కొచీ టస్కర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో అత్యధికంగా 19 వైడ్లు వేసి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండేది. ఇప్పుడు దాన్ని బెంగళూరు అధిగమించింది. అలాగే 2008లో రాజస్థాన్‌పై, 2018లో ముంబయిపైనా బెంగళూరు 18 వైడ్లు వేసింది. ఇక రాజస్థాన్ 2015లో కోల్‌కతాపై 18 వైడ్లు వేసి ఈ జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: IPL 2022: పంజాబ్ బోణీ.. ఆర్సీబీపై ఘన విజయం